CPM Protest( image CREDIT: SWETCHA REPORTER)
Politics

CPM Protest: 8న జిల్లా మండల కేంద్రాల్లో నిరసన: జాన్ వెస్లీ

CPM Protest: రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఈనెల 8న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) పిలుపునిచ్చారు. నిరసనలు జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సమావేశం ఎస్‌ వీరయ్య(S Veeraiah) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని, భవిష్యత్‌ కర్తవ్యాలను చర్చించారు. బిహార్‌లో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా వున్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ(Bjp) కుట్రపన్నుతున్నదన్నారు.

 Also Read: Srishti Fertility Center: డాక్టర్ నమ్రత ఖాతాల్లో భారీగా నగదు.. అకౌంట్లను ఫ్రీజ్ చేసిన అధికారులు

సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ

దాదాపు 64 లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగించిందని,ఇందులో అత్యధికంగా మైనారిటీలు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే ఉన్నాయన్నారు. బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావించి తొలగించిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అండదండలతో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్రపన్నుతున్నదని, దీనిని వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

పార్లమెంటులో చట్టం తీసుకురావాలి

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్రవ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 9,10 తేదీల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మైనార్టీలు పొందకూడదని అక్రమ పద్దతులలో బీజేపీ నాటకమాడుతున్నదన్నారు.కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కుల్ని సాధించుకునేందుకు సన్నద్దం కావాలన్నారు.

 Also Read: Muthyalamma temple: గుడికి రోడ్డు లేక భక్తుల తంటాలు.. పట్టించుకోని అధికారులు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?