along artist hema 86 people tested positive for drugs who participated in bengaluru rave party Big Breaking: నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్టు.. 86 మందికి పాజిటివ్
actor hema
క్రైమ్

Rave Party: 86 మందికి కన్ఫామ్.. రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

– సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్స్ చేతికి రేవ్ పార్టీ కేసు
– డ్రగ్స్ టెస్టుల్లో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్‌
– పాజిటివ్‌గా తేలిన వారికి సీసీబీ నోటీసులు
– సెక్స్ రాకెట్ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు
– మొత్తం 200 మంది హాజరైనట్టు గుర్తింపు
– ఎంట్రీ ఫీజ్ ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
– నిర్వహకుడు వాసు నేర చరిత్రపై కూపీ లాగుతున్న ఖాకీలు

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనమైంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి శాంపిల్స్ తీసుకుని డ్రగ్ టెస్టు చేయగా, 86 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో నటి హేమ కూడా ఉంది. అంటే వీరంతా ఆ రోజు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని కన్ఫామ్ అయింది. 86 మందిలో 59 మంది పురుషులుండగా 27 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టుల్లో బయటపడింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారందరికీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపనుంది.

బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫాంహౌస్‌లో వాసు అనే వ్యక్తం రేవ్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. రేవ్ పార్టీ జరిగినట్టు సమాచారం అందగా పోలీసులు తెల్లవారుజామున రెయిడ్ చేశారు. తనిఖీల్లో డ్రగ్స్ దొరికాయి. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వాసు సహా మరికొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ రేవ్ పార్టీ నిర్వాహకులు వాసు నేర చరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ పార్టీకి ఎంట్రీ ఫీజుగా రూ.2 లక్షలు నిర్దారించినట్టు పోలీసులు గుర్తించారు.

పార్టీకి మొత్తం 200 మంది హాజరై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ లభించడంతో సెక్స్ రాకెట్ నిర్వహించారా? అనే కోణంలోనూ అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేయాలని అనుకుంటున్నారు. ఈ కేసును ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్స్ విభాగానికి బదిలీ అయింది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డ్రగ్ టెస్టు నిర్వహించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమ ఈ వార్త బయటకు రాగానే తాను హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరున్నారో తనకు తెలియదని ఓ వీడియో చేసింది. అయితే, ఆ వీడియోను బెంగళూరు ఫాంహౌస్‌లోనే రికార్డు చేసిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆమె కచ్చితంగా పాల్గొన్నదని అంటున్నాయి.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క