Chitralayam Studios: ‘జర్నీ టు అయోధ్య’, గోపీచంద్ ‘విశ్వం’ తర్వాత టాలీవుడ్ నిర్మాణ సంస్థ చిత్రాలయం స్టూడియోస్ తమ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ప్రొడక్షన్ నెంబర్ 3కి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ సంస్థ గ్రాండ్‌గా నిర్వహించింది. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి (Venu Donepudi) ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం అతిరథ మహారధుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read- Sattamum Needhiyum: ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట.. సక్సెస్ కావడంతో!
ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా, ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ఫస్ట్ షాట్‌కు మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు. నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
విశ్వం సక్సెస్‌తో..
గోపీచంద్ (Gopichand) హీరోగా, కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా ఈ చిత్రాలయం స్టూడియోస్ (Chitralayam Studios) బ్యానర్‌లో వచ్చిన ‘విశ్వం’ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణనే పొందింది. ఈ సినిమాతో ఈ బ్యానర్ వేల్యూ కూడా పెరిగింది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!
ప్రొడక్షన్ దశలోనే ‘జర్నీ టు అయోధ్య’
‘విశ్వం’ సినిమా తర్వాత ఈ బ్యానర్ నుంచి ‘జర్నీ టు అయోధ్య’ మూవీని నిర్మాత ప్రౌడ్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన చెప్పిన విశేషాలు, ప్రొడక్షన్ దశలోనే అంచనాలు ఏర్పడేలా చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రొడక్షన్ జరుగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ కూడా వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని గొప్ప చిత్రాలను ఈ బ్యానర్ నుంచి వస్తాయని నిర్మాత వేణు దోనేపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు