India on US Tariff: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలతో (US Tariff) పాటు భారత్ (India) పై పెనాల్టీ సైతం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి భారత ప్రభుత్వం దీటుగా బదులిస్తూ అమెరికా వైఖరిని తాజాగా తీవ్రంగా ఎండగట్టింది. అటు భారత రిఫైనరీలను యూరోపియన్ యూనియన్ (European Union) లక్ష్యంగా చేసుకోవడంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రష్యాతో మీ వాణిజ్యం సంగతేంటి?
భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా (America), ఈయూ (EU)కు భారత విదేశాంగ శాఖ (Indian Foreign Ministry) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దేశీయ అవసరాల దృష్ట్యా మాత్రమే రష్యా (Russia) నుంచి భారత్ చమురు దిగుమతి (Old Imorts) చేసుకుంటోందని స్పష్టం చేసింది. అయితే తమను విమర్శిస్తున్న దేశాలు.. ఎలాంటి అవసరం లేకపోయినా కూడా రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాతో యూరోపియన్ యూనియన్ చేస్తున్న వాణిజ్యానికి సంబంధించిన గణాంకాలను సైతం భారత విదేశాంగ శాఖ బయటపెట్టిది.
లెక్కలతో సూటి ప్రశ్నలు
‘2024లో రష్యాతో యూరోపియన్ యూనియన్ వాణిజ్యం 67.5 బిలియన్ యూరోలు. అంతకుముందు ఏడాదిలో జరిగిన 17.2 బిలియన్ యూరోల వాణిజ్యంతో పోలిస్తే గతేడాది భారీగా పెరిగింది. ఇది భారత్-రష్యా మొత్తం వాణిజ్య కంటే చాలా ఎక్కువ. రష్యా నుంచి ఈయూ చేసుకునే ఎల్ఎన్జీ (LNG) దిగుమతులు గతేడాది రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ టన్నులకు చేరాయి. 2022లో నమోదైన 15.21 మిలియన్ టన్నుల రికార్డును అది బద్దలు కొట్టింది. యూరోప్-రష్యా వాణిజ్యం కేవలం ఇంధనమే కాకుండా ఎరువులు, గనుల ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు, యంత్రాలు, రవాణా పరికరాలను కూడా కలిగి ఉంది’ అని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది.
అమెరికా – రష్యా వాణిజ్యం సైతం..
అమెరికా-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని సైతం భారత ప్రభుత్వం ప్రస్తావించింది. ‘అమెరికా తన అణు పరిశ్రమ కోసం రష్యా నుండి యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహన పరిశ్రమ కోసం పల్లాడియం, అలాగే ఎరువులు, రసాయనాలను దిగుమతి చేస్తూనే ఉంది’ అని తెలిపింది. రష్యా నుండి చమురు దిగుమతులపై భారత వైఖరిని తప్పుబడుతూ అమెరికా, ఈయూ చేస్తున్న విమర్శలు ‘అన్యాయమైనవని, అనుచితమైనవి’గా భారత్ అభివర్ణించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాల తరహాలోనే భారత్ సైతం తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ మరోమారు స్పష్టం చేసింది.
ట్రంప్ హెచ్చరికలపై..
భారత్ అమెరికాకు చెల్లిస్తున్న సుంకాలను గణనీయంగా పెంచుతానని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపైనా భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు ప్రారంభించగా, ఆ సమయంలో అమెరికా స్వయంగా ఈ దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ గుర్తుచేసింది. మళ్లీ ఇప్పుడు సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఉక్రెయిన్ లో శాంతి ఒప్పందం ఆగస్టు 7-9 లోపు కుదరకపోతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
Also Read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!
అందువల్లే రష్యాతో వాణిజ్యం!
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం (Ukraine Russia War) ప్రారంభానికి ముందు.. భారత్ అధిక మెుత్తంలో చమురును మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకునేది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత పశ్చిమ దేశాలు రష్యా చమురును బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు ఆఫర్ చేయడంతో.. భారత్ తన అవసరాల దృష్ట్యా దిగుమతులు ప్రారంభించింది. అప్పటి నుంచి రష్యా నుంచి ఎక్కువ మెుత్తంలో చమురును భారత్ దిగుమతి చేసుకుంటూ వస్తోంది.