Kantara 3 Update
ఎంటర్‌టైన్మెంట్

Kantara 3: గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్..!

Kantara 3: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల లైనప్ చూస్తుంటే మెంటలెక్కేస్తుంది. ‘వార్ 2’ మూవీతో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో ఆయన పోటీ పడుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కమిటైన సినిమాలను చూస్తుంటే.. ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ చేయబోయే సినిమాలకు సంబంధించి కొన్ని సినిమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. వాటిలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ (ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు) ఒకటి కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా‌కు ఆయన కమిట్ అయ్యారు. ఈ రెండూ కాకుండా కొరటాల శివతో ‘దేవర 2’ ఎలాగూ ఉంది. ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

Also Read- Upasana: మెగా కోడలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు.. చిరు రియాక్షన్ చూశారా?

‘కాంతార 3’ (Kantara 3)లో ఎన్టీఆర్
ఆ ప్రముఖంగా వినిపిస్తున్న సినిమా ఏదో కాదు.. కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని దాదాపు రూ. 400 కోట్లను రాబట్టిన ‘కాంతార’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందనున్న ‘కాంతార 3’ మూవీ. అవును, ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ రిషబ్ శెట్టినే హీరో. కానీ ‘కాంతార 3’కి మాత్రం ఎన్టీఆర్ హీరో అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, ఈ సినిమాలో చేసేందుకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేలా అటు కన్నడ, ఇటు తెలుగు మీడియా సర్కిల్స్‌లో వార్తలు హైలైట్ అవుతున్నాయి. మైథలాజికల్ టచ్‌తో ఉండే ‘కాంతార 3’ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రిషబ్ శెట్టి కూడా నటించనున్నారనేది తాజా సమాచారం.

Also Read- King Nagarjuna: ‘కూలీ’ చివరిరోజు రజనీ సర్‌ అందరినీ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చారు

ఫ్యామిలీ ఫ్రెండ్స్
‘కాంతార’ తర్వాత రిషబ్ శెట్టి ఎక్కడ కనిపించినా ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఉండటం లేదు. ‘కాంతార’ సినిమాలో ఎన్టీఆర్ చేసి ఉంటే బాగుండేదని కూడా పలు స్టేజ్‌లపై ఆయన చెప్పి ఉన్నారు. అంతేకాదు, రిషబ్‌కి ఫేవరెట్ యాక్టర్ ఎవరని అడిగిన ప్రతిసారి ఆయన చెప్పిన పేరు ఎన్టీఆర్ అనే. అంతేకాదు.. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఇటీవల ఎన్టీఆర్ ఫ్యామిలీ‌ని రిషబ్ శెట్టి రిసీవ్ చేసుకున్న తీరు, ఆయన అభిమానులను కూడా ముగ్ధులను చేసింది. అభిమానం, స్నేహబంధంతోనే రిషబ్ శెట్టి.. ‘కాంతార 3’లో ఎన్టీఆర్‌కు పవర్ ఫుల్ పాత్రను క్రియేట్ చేసినట్లుగా టాక్ వినబడుతోంది. అలాగే ‘వార్ 2’ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్.. ‘కాంతార 3’ సినిమాతో ‘కన్నడ’ ఇండస్ట్రీలో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?