Jagtial district: తిరిగి తిరిగి విసుగు వచ్చింది. కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి దరఖాస్తులు ఇచ్చి విసుగు వచ్చిన ఓ వికలాంగుడు(Disabled Person) వినూత్న పోరాటం మొదలు పెట్టాడు. ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చి ఏకంగా కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని తన ఆవేదనను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా(Jagtial District) మల్లాపూర్ మండలం ముత్యంపేట(Mutyampet) గ్రామానికి చెందిన మర్రిపెల్లి రాజు(Raju) గంగారం అనే వికలాంగుడు తన ఇంటికి(Home) దారి ఇవ్వడం లేదని ఈ విషయంపై గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాను.
అధికారులు కనికరం చూపడం లేదు
ఇంత తిరుగుతున్న ఆర్డీవో(RDO) ఎమ్మార్వో(MRO), ఎంపీడీవో(MPDO) ఎవరు తన గోడు పట్టించుకోలేదు. ఎనమిది ఏండ్ల నుంచి తిరుగుతున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం నల్ల కోసం ఫీజు చెల్లించిన బాట లేదని నల్ల ఇవ్వడం లేదని బాధితుడు పేర్కొన్నాడు. ఇంటికి బాట లేక, నల్ల లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న అధికారులు కనికరం చూపడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపాడు.
Also Read: Gadwal District: గురుకుల విద్యార్థుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి
తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని హెచ్చరించాడు. మాజీ, ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి(Jeevan Reddy), పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసిన బాధితుడు వినలేదు. చివరకు పోలీసులు అధికారుల వద్దకు తీసుకెళ్లారు. న్యాయం చేస్తానని హామి ఇవ్వటంతో ఆందోళన విరమించాడు.
Also Read; KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్