Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 10,000 అడుగులు తప్పనిసరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత బిజీ జీవితాల్లో చాలామంది ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకుంటూ మిగిలిన రోజుల్లో సైలెంట్ అయిపోతున్నారు. అయితే రోజుకు 10K స్టెప్స్ సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఫిట్ నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లైజా మేరి పాస్క్వాలే (Liza Marie Pasquale) తెలిపారు. 30 మార్గాలను అనుసరించి.. రోజుకు 10000 అడుగులు వేయడం ఎంత సులభమో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
3 నెలల్లో 13 కేజీలు లాస్..!
ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లైజా మేరీ పాస్క్వాలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ఫిట్ నెస్ కోసం ముందుగా చిన్న లక్ష్యాలతో మెుదలు పెట్టాలని ఆమె సూచించారు. ‘నేను చిన్న లక్ష్యాలతోనే మొదలుపెట్టాను. ఒక్కోటి అలవాటు చేసుకుంటూ ముందుకెళ్లాను. నా మొదటి అలవాటు రోజుకు 10,000 స్టెప్స్ నడవడం. దానితో నేను 3 నెలల్లో 30 పౌండ్లు (13.6 కేజీలు) తగ్గాను. కాబట్టి ఈ రోజు మీకు స్టెప్స్ సాధించడానికి 30 మార్గాలు చెబుతున్నాను’ అని లైజా అన్నారు.
View this post on Instagram
‘జీవితం విలువైందిగా మార్చుకోండి’
‘చిన్నగా మొదలుపెడితేనే పెద్ద ఫలితాలు వస్తాయి. నేను బరువు తగ్గడానికి ఎంతగానో ప్రయత్నించాను అన్నింట్లోనూ విఫలమయ్యాను. అధిక శ్రమ, తక్షణ ఫలితాలు కనిపించకపోవడంతో ఒక్కో ప్రయత్నాన్ని వదిలేస్తూ వచ్చాను. ఆ సమయంలోనే చిన్నదే మొదలు పెట్టాలని దానిని అలవాటుగా మార్చుకొని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను’ అని లైజా అన్నారు. ‘ఎక్కువ మంది మహిళలను ఆరోగ్యంగా, ఆనందంగా మార్చడమే నా జీవిత లక్ష్యం. వారు దాక్కోవడం మానేసి వెలుగులోకి రావడానికి సహాయమందిస్తా. జీవితం ఒక్కటే ఉంది. దాన్ని విలువైనదిగా మార్చుకోండి’ అంటూ మహిళలకు సూచించారు.
లైజా చెప్పిన 10K స్టెప్స్ సాధించే 30 మార్గాలు:
1. ఉదయం ఒక మైలు నడవండి.
2. మీ పిల్లను తీసుకురావడానికి వేచి ఉండక మీరే నడుచుకుంటూ వెళ్లండి.
3. వ్యాయామం చేసిన తర్వాత 5 నిమిషాలు నడవండి.
4. ఫోన్‌లో మాట్లాడుతూనే నడవండి.
5. లంచ్ బ్రేక్‌లో నడవండి.
6. రాత్రి భోజనం తర్వాత నడవండి.
7. జిమ్ లేదా ఇంట్లో వ్యాయామం చేసేటప్పుడు నడవండి.
8. ఆఫీస్‌లో దూరంగా ఉండే బాత్‌రూమ్‌కి వెళ్లండి.
9. పని గంటల్లో లేచి నడవడానికి ఫోన్‌లో రిమైండర్ పెట్టండి.
10. వంట చేస్తున్నప్పుడు కిచెన్‌లో తిరుగుతూ నడవండి.
11. పళ్ళు తోముకుంటూనే నడవండి.
12. వాకింగ్ ప్యాడ్‌లో పెట్టుబడి పెట్టండి.
13. రియాలిటీ టీవీ చూడటానికి వాకింగ్ ప్యాడ్ వాడండి.
14. వాహనాన్ని దూరంగా పార్క్ చేయండి.
15. పిల్లలను పాఠశాల లేదా బస్సు స్టాప్‌కి నడిపించండి.
16. కాఫీ తాగిన తర్వాత స్నేహితుడితో నడవండి.
17. లంచ్ బ్రేక్‌లో పనులు పూర్తి చేయండి.
18. ఈ -మెయిల్ లేదా మెసేజ్ పంపడం బదులుగా సహోద్యోగి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లండి.
19. ఇంటిని శుభ్రం చేయండి.
20. లాన్ మోవ్ (Mow your lawn) చేయండి.
21. వాక్యూమ్ క్లీనింగ్ చేయండి.
22. కుక్కను పెంచుకోండి. రోజూ దానిని సరదాగా వాకింగ్ కు తీసుకెళ్లండి.
23. బస్ లేదా రైలు స్టాప్‌కి ఒక స్టాప్ ముందు దిగండి.
24. అపాయింట్‌మెంట్‌కి ముందే వెళ్తే భవనం లేదా పార్కింగ్‌లో నడవండి.
25. ఎల్లప్పుడూ లిఫ్ట్ కు బదులు మెట్లు ఎక్కండి.
26. డ్యాన్స్ పార్టీ చేయండి (పిల్లలతో లేదా ఒంటరిగా).
27. డ్రైవ్-త్రూ బదులుగా (బ్యాంక్ లేదా ఫుడ్) లోపలికి వెళ్లండి.
28. హోం డెలివరీ బదులుగా టేక్ అవే కోసం లోపలికి వెళ్లండి.
29. స్టెప్ బెట్ (Step Bet) జాయిన్ అవ్వండి.
30. రోజుకు 5 నిమిషాలు జంప్ రోప్ చేయండి (దాంతో 1,000 స్టెప్స్ వస్తాయి).
31. టీవీ చూస్తూనే లేదా ఫోన్‌లో స్క్రోల్ చేస్తూనే ఒకేచోట నడవండి.
గమనిక: మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా వార్తను అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.