mlc kavitha: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ల సాధనకై గాంధేయ మార్గంలో అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి(Telangana Jagruti)అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పష్టం చేశారు. (Hyderabad)హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. నేటి (ఈనెల 4)నుంచి చేపట్టబోయే దీక్షకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీల్లో 112 కులాలు ఉన్నాయని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40 కులాలు మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని, అందుకే తెలంగాణ జాగృతి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు.
Also Read: Kavitha vs Jagadeesh: కవిత వ్యాఖ్యలతో ఎర్రవెల్లికి వెళ్లిన మాజీ మంత్రి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్,(Congress) బీజేపీ(Bjp) కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఆర్డినెన్సుపై బీజేపీ(Bjp) స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా అమలు చేయకుండా ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఆపడం అంటే బీసీలను తొక్కిపట్టడమేనన్నారు. ఆర్డినెన్స్‌ను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో ఎవరికోసం ధర్నా చేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.
వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు
జాతీయ పార్టీలు రెండు కలిసి బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నాయనం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నందుకే తనపై ఆరోపణలు, వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు అని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతంలో ముస్లింమైనార్టీలు ఉన్నారా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు 46శాతం మంది ఉన్నారని, 42శాతం ఇస్తే 4 శాతం రిజర్వేషన్లను ఏ కులానికి తొలగిస్తారని నిలదీశారు. ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పనిచేసేవారికే ప్రజల మద్దతు ఉంటుందన్నారు.
72 గంటల దీక్ష
ప్రభుత్వం దీక్షకు అనుమతి ఇవ్వకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తానని ప్రకటించారు. 72 గంటల దీక్షకు ఉక్క సంకల్పంతో ఉన్నామన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం తనకు అలవాటు లేదన్నారు. సీఎం రమేష్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యల వెనుక తాను కేసీఆర్(KCR)కు రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు. రాహుల్ గాంధీ,(Rahul Gandhi)ప్రియాంక గాంధీ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. నేటి నుంచి తాము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Allu Aravind: ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నా!