Telangana: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి రాష్ట్రంలో తొలిసారిగా స్టేట్ పోలీస్ కంప్లయింట్ అథారిటీ (ఎస్పీసీఏ) ఏర్పాటు చేశారు. బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులో దీనిని ఆదివారం ప్రారంభించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ. శివశంకర్ రావు ఈ అథారిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎస్పీసీఏలో డీఎస్పీ, ఆపై స్థాయి పోలీసు అధికారులపై ఫిర్యాదులు చేయవచ్చు. ప్రజలు తమకు పోలీసు అధికారుల నుంచి ఏవైనా సమస్యలు ఎదురైతే ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని జస్టిస్ శివశంకర్ రావు తెలిపారు.
Also Read: Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!
ఎస్పీసీఏ ఏర్పాటుతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని, ఇది స్వతంత్రంగా పని చేస్తుందని జస్టిస్ బీ. శివశంకర్ రావు పేర్కొన్నారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ ప్రమోద్ కుమార్, రిటైర్డ్ జడ్జి వర్రె వెంకటేశ్వర్లు, అరవింద్ రెడ్డి, కేవీ రామనర్సింహా రెడ్డి, ఎస్ రాజేందర్, ఏఐజీ (లా అండ్ ఆర్డర్) రమణకుమార్ తదితరులు ఉన్నారు.