CM Revanth Reddy (imagecredit:twitter)
Politics

CM Revanth Reddy: మోడీని కుర్చీ దించేయడం ఆయనకు మాత్రమే సాధ్యం

CM Revanth Reddy: మోడీని కుర్చీ నుంచి దింపడం ఆర్ఎస్ఎస్(RSS) తోనూ సాధ్యం కావడం లేదని, కానీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తప్పకుండా దించేస్తారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. 2001 నుంచి న‌రేంద్ర మోదీ కుర్చీ వదలడం లేదని, ముఖ్యమంత్రి మొద‌లు ఇప్పటి వ‌ర‌కు పవర్ కుర్చీ వ‌ద‌ల‌డం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పినా మోదీ విన‌డం లేదన్నారు. గతంలో వాజ్ పేయ్ మాటలను లెక్కలేయలేదన్నారు. మోదీని గద్దె దించాలనే ఆర్ఎస్ఎస్ కోరికను రాహుల్ గాంధీ తప్పనిసరిగా నెరవేర్చుతామని సీఎం(CM) హామీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఏఐసీసీ(AICC) ఆధ్వర్యంలో నిర్వహించిన కానిస్టిట్యూష‌నల్ ఛాలెంజెస్‌, ప‌ర్‌స్పెక్టివ్స్ అండ్ పాథ్‌వేస్ స‌దస్సులో సీఎం మాట్లాడారు.

ఆర్ఎస్ఎస్ సంఘ్ చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్
75 ఏళ్ల నిండిన వారు కుర్చీ వ‌ద‌లాల‌ని రెండు నెల‌ల క్రితం ఆర్ఎస్ఎస్ సంఘ్ చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్(Mohan Bhagwat) చెప్పినా మోదీ(Modhi) వ‌దులుకునేందుకు సిద్దంగా లేరన్నారు. అద్వానీ(Adhwani), ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి(Murali Mnohar Joshi)కి వ‌ర్తించే నిబంధ‌న‌లు మోదీ(Modhi)కి వ‌ర్తించ‌వా? అంటూ నిలదీశారు. మోదీ లేకుంటే బీజేపీ9BJP)కి 150 సీట్లు కూడా రావ‌ని స్వయంగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే(MP Nishikant Dubey) ప్రక‌టించార్నారు. కానీ దూబే త‌న డైరీలో రాసుపెట్టుకోవాలని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలోని పోరాడి, బీజేపీకి 150కి మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాకుండా అడ్డుకుంటామన్నారు.

Also Read: Revanth Reddy: నిబద్ధత గల జర్నలిజానికి లక్ష్మణ రేఖ గీయాలి: సీఎం

ఆయ‌న హామీ మేర‌కే తెలంగాణ
ఇక ఓబీసీ9OBC)ల‌కు సామాజిక న్యాయం సాధించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో తామంతా పోరాడ‌తామన్నారు. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) చేశారని, ఆ స‌మ‌యంలో తెలంగాణ‌9Telangana)లో కుల గ‌ణ‌న‌కు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. ఆయ‌న హామీ మేర‌కే తెలంగాణ ప్రజ‌లు ప్రేమ దుకాణాలు (మొహ‌బ్బత్ కా దుకాణ్‌) తెరిచారన్నారు. అందుకే తెలంగాణ‌లో తాము కుల గ‌ణ‌న(Caste census) చేశామన్నారు. దేశానికి తెలంగాణ మోడ‌ల్ ఇచ్చామన్నారు. దేశంలో సామాజిక న్యాయం, కుల గ‌ణ‌న కోసం ఓబీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించేందుకు ఫైట్ చేస్తామన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే కాంగ్రెస్(Congress) పార్టీ ఉన్నదని, బ్రిటిష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు.

ఉగ్రవాదుల నుంచి ర‌క్షించే క్రమంలో
ఇందిరాగాంధీ(Indira Gandhi) పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి రెండు ముక్కలు చేసి కాళీ మాతాగా గుర్తింపుపొందారన్నారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించిందన్నారు. ఉగ్రవాదుల నుంచి ర‌క్షించే క్రమంలో ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఇక రాహుల్ గాంధీ అనుకుంటే 2004లోనే కేంద్ర మంత్రి, 2009లోనే ప్రధాన‌మంత్రి అయ్యే వారని, కానీ ఆ రెండింటిని ఆయ‌న త్యాగం చేశారన్నారు. త్యాగాలు కాంగ్రెస్‌(Congress)కు కొత్త కాదన్నారు. సామాన్య కార్యక‌ర్తగానే రాహుల్ కొన‌సాగుతున్నారన్నారు. పేద‌లు, ద‌ళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోరాడుతునే ఉన్నారని వెల్లడించారు.

Also Read: Meenakshi Natrajan: జనహిత పాదయాత్రలో జనసంద్రంగా మారిన అందోలు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?