Revanth Reddy: నిబద్ధత గల జర్నలిజం వృత్తి రానురాను ప్రజల్లో పలచన అవుతున్నది. దీనికి కారణం ఎవరుబడితే వాళ్లు జర్నలిస్టులమని చెప్పుకుని తిరుగుతుండడమే. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నవ తెలంగాణ దినపత్రిక(Telangana Daily Newspaper) పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం(cm) మాట్లాడుతూ, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
పత్రికల పాత్ర చాలా కీలకం
ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని రేవంత్ అన్నారు. . స్వాతంత్య్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. సాయుధ రైతాంగ పోరాటంలో, సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు మేలు చేశాయన్నారు. కానీ, ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
జర్నలిజంలో వింత పోకడ
తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పని చేస్తున్నాయన్నారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోందని వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నిజమైన జర్నలిస్టులు ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు. లేకుంటే దేశ భద్రతకే ప్రమాదం అని వెల్లడించారు. తిట్లు వచ్చినోళ్లు, ఆవారాలు జర్నలిస్టుల(Journalists)మని అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
కమ్యూనిస్టుల సహకారం
కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) పవర్‌లోకి రావడానికి కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ఉన్నదన్నారు. గతమైనా ప్రస్తుతమైనా కమ్యూనిస్టుల సహకారం మరువలేనిదని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. పరస్పర మద్దతు, సంబంధాలు ఎప్పటికీ ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
Also Read: Pawan Kalyan: విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు వచ్చేశాయ్..