Baby Team
ఎంటర్‌టైన్మెంట్

Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!

Sai Rajesh: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్‌లో (71st National Awards) టాలీవుడ్‌‌ తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ అవార్డును దక్కించుకోగా, ‘హనుమాన్’, ‘బేబి’ చిత్రాలు రెండేసి అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నాయి. ‘బలగం’ సినిమాలోని పాటకు గాను ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌ను, ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలోని నటనకుగానూ ఉత్తమ బాలనటిగా సుకృతిని అవార్డులు వరించాయి. ‘బేబి’ (Baby Movie) సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ‘బేబి’ మూవీ టీమ్ మీడియా సమావేశం నిర్వహించి, తమ ఆనందాన్ని తెలియజేశారు.

Also Read- Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఉదయ భాను ఊర మాస్ సాంగ్

ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమాకు టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పని చేసింది. అందుకే రెండేళ్లయినా ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమా పోస్టర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ అనే పేరు చూడటం అంటే.. నా డ్రీమ్ నెరవేరిన ఫీలింగ్ కలుగుతోంది. డైరెక్టర్ సాయి రాజేశ్ ‘కలర్ ఫొటో’ తర్వాత మళ్లీ ‘బేబి’ మూవీకి నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న డైరెక్టర్‌గా గౌరవాన్ని అందుకున్నారు. ఆయన నెక్ట్స్ చేయబోయే ప్రతి సినిమాకు ఈ మూవీ చేస్తున్నది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అని చెప్పుకుంటుంటే చాలా గౌరవంగా ఉంటుంది. నిర్మాత ఎస్ కేఎన్ ఈ మూవీని ప్రమోషన్ చేసిన విధానం ఎన్నో సినిమాలకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అయ్యింది. ‘బేబి’ ప్రీమియర్స్ తర్వాత ఇది ‘కల్ట్ బ్లాక్ బస్టర్’ అని ఎస్‌కేఎన్ మైక్ విసిరేశారు. ఆయన అన్నట్లే ఈ సినిమా నిలిచింది. ఇందులోని ‘ప్రేమిస్తున్నా’ పాట విన్న తర్వాత మేమంతా కథ మూడ్‌లోకి వెళ్లిపోయి నటించాం. రోహిత్ టాలెంటెడ్ సింగర్. అతనికి సరైన గుర్తింపు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా హ్యాపీ. మనం ఏదైనా గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని దర్శకుడు సాయి రాజేశ్ నిరూపించారు. ఎస్‌కేఎన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతగానో నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ‘ప్రేమిస్తున్నా’ పాట వింటూనే మేమంతా ఒక మూడ్‌లో ఉండి ‘బేబి’ షూటింగ్ చేశాం. ‘బేబి’ సినిమాలానే ఈ పాట కూడా మా మనసుల్లో ఉండిపోయిందని తెలిపారు.

Also Read- Siraj-Bumrah: బుమ్రాను ఒక ప్రశ్న అడిగిన మహ్మద్ సిరాజ్.. సమాధానం ఇదే

డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమా స్క్రిప్ట్ రాసేప్పడు ఒక మూడ్‌లో ఉండిపోయేవాడిని. నేనే ఆనంద్ దేవరకొండ అయితే, నేనే విరాజ్ అయితే ఎలా ఉంటానో.. ఆ మూడ్‌లో ఉండి స్క్రిప్ట్ రాశాను. రెండేళ్లు ఈ కథ నా మైండ్‌లో అలా ఉండిపోయింది. ప్రతి సన్నివేశాన్ని ఇంకాస్త బెటర్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేశాను. స్క్రీన్‌ప్లేకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు.. నా కష్టానికి గుర్తింపు వచ్చిందని ఆనందించా. అంతకంటే ఎక్కువగా ‘ప్రేమిస్తున్నా’ సాంగ్‌కు బెస్ట్ సింగర్‌గా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఆనందించాను. ఈ పాట లాస్ట్‌లో కంపోజ్ చేద్దామని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్‌తో చెప్పాను. ఈ పాట విషాదకరమైన మూడ్‌లో ఉన్నా, బ్యాక్ గ్రౌండ్‌లో వాళ్లు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉంటాయి. సురేష్ బనిశెట్టి ‘ప్రేమిస్తున్నా’ పాటలో మన కథలాంటి మరో కథ చరిత్రలో ఉండదంటూనే రాశాడు. ఈ లైన్ చదవగానే చాలా ఇన్స్‌పైర్ అయ్యాను. రోహిత్ పాడిన పాట విన్నప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ‘ప్రేమిస్తున్నా’ పాట ఇచ్చిన స్ఫూర్తితో ‘బేబి’ సినిమాను మరింత హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించాను. అంతా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ధీరజ్.. నాకూ, ఎస్‌కేఎన్‌కు మధ్య వారధిలా ఉంటాడు. వైష్ణవి హీరోయిన్‌గా మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆనంద్ లుక్ చాలా బాగుంది. బేబి సినిమాకు వచ్చిన బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డ్ మా ఎడిటర్ విప్లవ్‌కు కూడా చెందాలి. నన్ను ఎవరూ నమ్మని రోజు.. ఎస్‌కేఎన్ నమ్మాడు. ఆ నమ్మకమే నన్ను ఇంత వరకు తీసుకువచ్చింది.. థ్యాంక్ యూ ఆల్ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?