udayabhanu (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఉదయ భాను ఊర మాస్ సాంగ్

Tribanadhari Barbarik: వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ (Tribanadhari Barbarik). కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ సాగే ఈ పాటను రఘు రామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట అందులోనూ ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీకి బీ, సీ సెంటర్లు ఊగిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

Read also- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ చూసి సుకుమార్ ఫోన్ చేశారు.. అప్పుడు సంతోషించా!

ఇప్పటి వరకు వదిలిన ‘నీ వల్లే నీ వల్లే’, అనగనగా కథలా, బార్బరిక్ థీమ్ సాంగ్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. చిత్రయూనిట్ ప్రమోషన్ పనుల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు నెలకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను పాత్ర మరింత ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని టీం ప్రకటించనుంది. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన తదితరులు నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు.

Read also- SKN: ఒక చెట్టు పెంచితే పండ్లు ఇవ్వడమే కాదు.. ఎండిపోయాక కూడా!

ముఖ్యంగా ఉదయ భాను పాత్ర చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ సినిమా కథాంశం, చిత్రీకరణ శైలి, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయని చిత్ర బృందం ధీమాగా ఉంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో సందడి చేయనుందని, యాక్షన్, ఎమోషన్, కామెడీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ‘త్రిబాణధారి బార్బరిక్‌’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించేలా రూపొందిందని, థియేటర్లలో విజయవంతంగా ఆడుతుందని అందరూ ఆశిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?