Sheep Distribution Scam: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు జరుపుతున్న విచారణలో దిగ్భ్రాంతికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అమలు చేసిన ఈ స్కీంలో వెయ్యి కోట్ల వరకు స్కాం జరిగినట్టుగా ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) వద్ద ఓఎస్డీగా పని చేసి ఈ కేసులో కీలక నిందితునిగా ఉన్న కళ్యాణ్ ఇంటి నుంచి 200 బ్యాంక్ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 31 సెల్ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్‌చేశారు. ఇక, కళ్యాణ్(Kalyan) ఆన్ లైన్ బెట్టింగ్ యాప్(Online betting app)లకు బ్యాంక్ అకౌంట్లను కూడా సమకూర్చినట్టుగా కనుగొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికీ పరారీలో ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్(Moinuddin), అతని కుమారుడు ఇక్రముద్దీన్(Ikramuddin)లు పట్టుబడితే ఈ కేసులో మరిన్ని సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2017లో..
2017లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని(Sheep Distribution Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది గొల్లకురుమల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకు వస్తుందని గొప్పగా చెప్పిన అప్పటి ప్రభుత్వం పథకానికి 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక, ఇరవై గొర్రెలు, ఒక పొట్టేల్తో కూడిన యూనిట్ధరను లక్షా 25రూపాయలుగా నిర్ణయించింది. ఈ రేటుకు గొర్రెల యూనిట్లు కొని పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రవేశంతో
అయితే, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్‌లు ఎంట్రీ ఇచ్చిన తరువాత స్కీం స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు లక్షా 25 వేలుగా ఉన్న ఒక్కో యూనిట్ ధర ప్రభుత్వ ఆమోదం లేకుండానే లక్షా 75వేలకు పెరిగింది. ధర పెంచినా పథకాన్ని సరిగ్గా అమలు చేశారా? అంటే అదీ లేదు. గొర్రెల విక్రయందారుల నుంచి వాటిని కొని చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన ఏడుకొండలుతోపాటు మరికొందరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు, మొయినుద్దీన్, ఇక్రముద్దీన్కలిసి గొర్రెలు కొని ఇవ్వాల్సిన 2.1కోట్ల రూపాయలను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టుగా అందులో పేర్కొన్నారు. దీంతో ఈ పథకంలోని కుంభకోణం తీగ కదిలింది.
ఏసీబీ విచారణలో
గొర్రెల స్కీంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావటంతో ప్రస్తుత ప్రభుత్వం కేసును ఏసీబీ(ACB)కి అప్పగించింది. ఏసీబీ(ACB) విచారణలో దిమ్మతిరిగే వివరాలు వెలుగు చూశాయి. గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బయట పడింది. ఈ క్రమంలో పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్(Ramchander Nayak)తోపాటు ఈ స్కీంలో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించిన పలువురిని ఏసీబీ(ACB) అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav) వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇక, కాగ్జరిపిన ఆడిట్‌లో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టుగా వెల్లడైంది.
Also Read; Telangana Mandals: ప్రభుత్వం వద్ద ఎంపీడీవోల పదోన్నతుల ఫైల్
ఈడీ ప్రవేశంతో
కాగా, గొర్రెల పంపిణీలో గోల్మాల్ అయిన నిధుల్లో మనీలాండరింగ్(Money laundering) జరిగినట్టుగా అనుమానించిన ఈడీ(ED) అధికారులు కొంతకాలం క్రితం దీనిపై కేసులు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్‌నాయక్(Ramchandra Nayak), కళ్యాణ్(Kalyan) నివాసాలతోపాటు మొత్తం 8చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి విస్తృతస్థాయిలో సోదాలు జరిపారు.
పంపిణీ చేయకుండానే
ఈడీ అధికారుల విచారణలో లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా వెల్లడైంది. నిజానికి లబ్దిదారులుగా చూపిన వారిలో చాలామంది అంతకు ముందు ఎప్పుడూ గొర్రెల వ్యాపారం చేయలేదని స్పష్టమైంది. వీళ్లు ఎప్పుడూ గొర్రెలను కొనటంగానీ.. అమ్మటంగానీ చేయలేదని నిర్దారణ అయ్యింది. అవినీతికి పాల్పడ్డ అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు(Private contractors) కొంతమంది బోగస్లబ్దిదారులుగా పేర్కొని వారి ఖాతాల్లోకి డబ్బు మళ్లించినట్టుగా తేలింది. ఊహాజనిత వ్యాపారుల పేర నిధులను పక్కదారి పట్టించినట్టుగా వెల్లడైంది. ఈ మొత్తం అవినీతి బాగోతంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఈడీ అధికారుల చేతికి పలు కీలక డాక్యుమెంట్లు కూడా చిక్కాయి.
వాల్లు కూడా దోరికితే
ఇక, మాజీ మంత్రి వద్ద ఓఎస్డీ(OSD)గా పని చేసిన కళ్యాణ్(Kalyan) ఇంట్లో జరిపిన తనిఖీల్లో 200 బ్యాంక్పాస్ బుక్కులు(Bank Pass Books) దొరికాయి. దాంతోపాటు 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు కూడా లభ్యమయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే బెట్టింగ్ యాప్(Betting App) ల నిర్వాహకులకు కళ్యాణ్ బ్యాంక్‌ఖాతాలను సమకూర్చినట్టుగా ఈడీ(ED) విచారణలో వెల్లడి కావటం. ఇప్పటి వరకు జరిపిన విచారణలో గొర్రెల పంపిణీ స్కీంలో 1000 కోట్ల స్కాం జరిగినట్టుగా వెల్లడైందని ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ తోపాటు మరికొందరు పట్టుబడితే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: Nagarjuna Sagar: నాగార్జునసాగర్ తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు