Telangana Mandals (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Mandals: ప్రభుత్వం వద్ద ఎంపీడీవోల పదోన్నతుల ఫైల్

Telangana Mandals: తెలంగాణలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDO) ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి చేరి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి కదలికా లేకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ పదోన్నతులు రాకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోల(MPDO) పదోన్నతుల కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఎంపీడీవోలు సీనియర్లుగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ జాబితాను తయారు చేసింది. వీరికి డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి లభించనుంది.

అదేవిధంగా,10 మంది డిప్యూటీ సీఈఓలకు సీఈఓ(CEO)లుగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. 2019 నుంచి 2022 వరకు ఎంపీడీవోలకు పదోన్నతుల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత నుంచి ప్రమోషన్ల ప్రస్తావనే లేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌లో కదలిక వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసి నివేదికను సమర్పించింది.

Also Read: Fake Embassy: నకిలీ ఎంబసీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

ఆరు నెలల క్రితమే..
పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎంపీడీవో(MPDO)ల వివరాలతో కూడిన సీనియర్ లిస్టు ఫైల్‌ను ప్రభుత్వానికి అందజేసి ఆరు నెలలు అయిందని విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ ఫైల్‌లో కదలిక రాలేదు. పలుమార్లు అధికారులు సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. పదోన్నతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగులు కొందరు నిరాశకు గురవుతున్నారు. ఇంకొంతమంది చేసే పనులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పదోన్నతుల ఫైల్‌పై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా, సూపరింటెండెంట్ల పదోన్నతుల కోసం కూడా పంచాయతీరాజ్ శాఖ జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా, త్వరలోనే ఎంపీడీవోల(MPDO)కు పదోన్నతుల శుభవార్తను ప్రభుత్వం చెప్పబోతుంది.

Also Read: Nimisha Priya Case: నిమిష ప్రియకు భారీ ఊరట.. ఫలించిన చర్చలు.. మరణశిక్ష రద్దు!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?