Gautam Gambhir Made Sensational Comments
స్పోర్ట్స్

Gautam Gambir: సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్‌ గంభీర్‌

Gautam Gambhir Made Sensational Comments: టీమ్ ఇండియా టీ20, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గ‌డంలో కీ రోల్‌ పోషించాడు గౌత‌మ్ గంభీర్‌. ఓపెన‌ర్‌గా అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లో ఎంతగానో అల‌రించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డంలోనూ త‌న వంతు పాత్ర పోషించాడు. కాగా ఓ ప్రోగ్రామ్‌లో గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన చిన్నతనంలో ఓ సెలక్టర్ కాళ్లు మొక్కలేదని అందుకే జట్టులోకి ఎంపిక చేయలేదన్నాడు.

ఆ టైంలో త‌న‌కు 13 సంవ‌త్స‌రాలు ఉండొచ్చని గుర్తుచేసుకున్నాడు. అండ‌ర్‌ 14 టోర్న‌మెంట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డినా జ‌ట్టుకు మాత్రం ఎంపిక కాలేద‌ని గంభీర్ చెప్పాడు. ఇందుకు రీజన్‌ త‌రువాత తెలిసింద‌న్నాడు. సెల‌క్ట‌ర్ కాళ్లు మొక్క‌లేద‌ని అందుక‌నే త‌న‌ను ఎంపిక చేయ‌లేదని తెలిసింది. ఆ టైంలో నేను ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాను. తాను ఎవ‌రీ కాళ్లు ప‌ట్టుకోవ‌ద్ద‌ని, త‌న కాళ్లు ఎవ‌రితోనూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అనుకున్న‌ట్లు గంభీర్ చెప్పాడు. ఇక అండ‌ర్ 16, అండ‌ర్ 19, రంజీ ట్రోఫీ, టీమ్ఇండియా త‌రుపున ఆడుతూ విఫ‌లం అయిన సంద‌ర్భాల్లో బ‌య‌ట నుంచి ఎన్నో కామెంట్లు వ‌చ్చేవ‌న్నాడు. నువ్వు మంచి ఫ్యామిలీ నుంచి వ‌చ్చావు. అస‌లు నీకు క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు. నీకు ఎన్నో ఛాన్సులు ఉన్నాయి. మీ నాన్న బిజినెస్‌ల‌ను చూసుకోవ‌చ్చంటూ త‌న‌కు స‌ల‌హాలు ఇచ్చేవార‌న్నాడు.

Also Read: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అతడికే అంకితం 

దీంతో త‌న మ‌న‌సు ఎన్నో ఆలోచ‌న‌ల‌తో నిండిపోయింద‌న్నాడు. వాటి నుంచి బ‌య‌టప‌డేందుకు ఎంతో శ్ర‌మించిన‌ట్లు గంభీర్ తన మనసులోని మాటను రివీల్‌ చేశాడు. త‌న‌కు ఫ్యామిలీ కంటే క్రికెట్ ఎక్కువ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు ఎందుకు అర్థం చేసుకోవ‌డం లేద‌ని గంభీర్‌కి అనిపించేద‌న్నాడు. మొత్తానికి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ తాను ఈ స్థాయికి వచ్చినట్టు గౌత‌మ్ గంభీర్‌ ఎంతో గౌరవంగా చెప్పుకొచ్చాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!