Sports News | మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అతడికే అంకితం 
Man Of The Match Is Dedicated To Him
స్పోర్ట్స్

Sports News: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అతడికే అంకితం 

Man Of The Match Is Dedicated To Him: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పటిలానే ఆర్‌సీబీ టీమ్‌కి, ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదనే విమర్శలు వచ్చాయి. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ, వరుసగా ఆరు విజయాలతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరింది. అయితే ధోనీ, జడేజా వంటి స్టార్‌ ప్లేయర్‌లు క్రీజులో ఉండగా అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని గెలిపించిన యశ్‌ దయాల్‌ ఆర్‌సీబీ హీరోగా మారాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దయాల్‌, తన సక్సెస్‌, క్రికెట్‌ జర్నీ, టీమ్‌ సపోర్ట్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నాడు. చెన్నై ప్లేఆఫ్స్‌కి చేరాలంటే చివరి ఓవర్‌లో 17 రన్స్‌ చేయాల్సి వచ్చింది. క్రీజులో సీనియర్‌ ప్లేయర్‌లు ధోనీ, జడేజా ఉన్నారు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, యశ్ దయాల్‌కు బాల్‌ అందించాడు. దయాల్‌ వేసిన ఫస్ట్‌ బంతికే ధోనీ భారీ సిక్సర్‌ బాదాడు. అందరిలోనూ ఒత్తిడి పెరిగింది. కానీ యష్‌ దయాల్‌ తన ప్లాన్‌ని అమలు చేయడంపైనే ఫోకస్‌ చేశాడు. రెండో బంతికే ధోని భారీ షాట్‌కి ప్రయత్నించి, ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. తర్వాత నాలుగు బాల్స్‌కి కేవలం ఒక్క రన్‌ మాత్రమే ఇచ్చిన యశ్​ దయాల్, ఆర్‌సీబీని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు.

Also Read: చిల్ అవుతున్న మహీ, వైరల్ అవుతున్న వీడియో…

ఈ 26 ఏళ్ల పేసర్ తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు.ఇదంతా నా హార్డ్‌ వర్క్‌, విజువలైజేషన్, మజిల్ మెమరీ నుంచి వచ్చింది. ఇదంతా నిజంగా నా పేరెంట్స్‌ కృషి వల్లనే. నా స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై జాగ్రత్త తీసుకున్నారు. స్పోర్ట్స్‌పై నాకున్న ఇంట్రెస్ట్‌ని సపోర్ట్‌ చేశారని చెప్పాడు. ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి తనకు లభించిన సపోర్ట్‌ని దయాల్ హైలైట్ చేశాడు. ఈ ఘనత నా జట్టు ఆర్‌సీబీ, విరాట్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మహ్మద్ సిరాజ్, దినేశ్​ కార్తీక్‌కు చెందుతుంది.యశ్​ దయాల్‌ అద్భుతమైన ఆటతీరును మెచ్చుకుంటూ ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దయాల్​కు అంకితం చేశాడు.నేను ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని యశ్ దయాల్‌కి అంకితమిస్తున్నాను. అతను బౌలింగ్ చేసిన విధానం నమ్మశక్యం కాలేదు. యంగ్‌ బౌలర్‌గా అతను దానికి అర్హుడు. ఈ పిచ్‌పై పేస్ ఆఫ్ బెస్ట్‌ ఆప్షన్‌, అతను దాన్ని అద్భుతంగా అమలు చేశాడని డు ప్లెసిస్ అన్నాడు.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!