ACB Record (imagecredit:twitter)
తెలంగాణ

ACB Record: 145 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్.. రాష్ట్రంలో ఇదే పెద్ద రికార్డ్

ACB Record: ఆమ్యామ్యాలకు మరిగిన ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ వణుకు పుట్టిస్తోంది. మెరుపు దాడులు జరుపుతూ లంచావతారాలను రెడ్​ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. ఇక, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్న వారి భరతం కూడా పడుతోంది. ఈ క్రమంలో గడిచిన ఏడు నెలల్లో 148 కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడ్డ 145మంది అధికారులను అరెస్ట్ చేశారు. వీరిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఒక్క నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఇంజనీర్ల వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను గుర్తించారు.

స్టిక్కర్లు అతికించి టోల్ ఫ్రీం నెంబర్
ఫుల్​ఆపరేషన్ మో‌డ్‌లో పని చేస్తున్న ఏసీబీ(ACB) అవినీతిపరులకు చెక్​పెట్టటానికి విస్తృత చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారికంగా సాయ పడేందుకు ఎవ్వరు లంచం(Bribe) డిమాండ్​ చేసినా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వాటి పరిసర ప్రాంతాల్లో స్టిక్కర్లు అతికించి టోల్ ఫ్రీం నెంబర్(Toll Free) గురించి తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఒక్క జూలై(July) నెలలోనే అవినీతికి సంబంధించి 22 కేసులు నమోదు చేశారు. వీటిలో ట్రాప్ చేయటం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, క్రిమినల్ మిస్ కండక్ట్(Criminal Misconduct) తదితర కేసులు ఉండటం గమనార్హం.

Also Read: Tariff on India: భారత్‌పై ట్రంప్ ‘టారిఫ్ బాంబ్’.. సంచలన ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా 148 కేసులు నమోదు
ట్రాప్​కేసుల్లో 5.75లక్షలు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో 11.5 కోట్ల విలువైన ఆస్తులను బయట పెట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ(RTA)చెక్​పోస్టులు, సబ్​రిజిస్ట్రార్​కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరిపి తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో లెక్కల్లో లేని 1.49లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జనవరి నుంచి జూలై నెల చివరి వరకు రాష్ట్రవ్యాప్తంగా 148 కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ విజయ్​ కుమార్(ACB DG Vijay Kumar) తెలిపారు. వీటిల్లో 145మంది ఉద్యోగులను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ట్రాప కేసుల్లో 30.32 లక్షలు సీజ్ చేసినట్టు తెలియచేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో 39 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్టు తెలిపారు.

వీరిదే రికార్డ్
కాగా, నీటిపారుదల శాఖలో పని చేస్తున్న పలువురు ఇంజనీర్లతోపాటు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. మురళీధర్​రావు(Muralidhar Rao), నూనె శ్రీధర్(Sridhar)​, హరీరాంల(Hariram) ఇళ్లతోపాటు వారి బంధుమిత్రుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్​మార్కెట్(Private Markate) లో వీటి విలువ 1000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఏసీబీ(ACB) అధికారులు తెలిపారు.

Also Read: Komatireddy: రాష్ట్రానికే ఆదర్శంగా నల్గగొండ ఇంటిగ్రేటెడ్ స్కూల్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!