Meeseva: ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడంలో మీ సేవ(Mee Seva)లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముందుగా అవసరమైన వినియోగదారుడు సంబంధిత అధికారి వివరాలను ధ్రువీకరించిన అనంతరం మీ సేవలో అప్లై చేస్తారు. ప్రాసెస్ అనంతరం ధృవీకరణ పత్రాలు మీ సేవ కేంద్రాలలో జారీ చేయబడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 22 శాఖలకు సంబంధించిన 482 వివిధ రకాల సర్వీస్ లను ఒకే చోట లభిస్తుండడంతో ప్రజలకు వెసులుబాటు కలిగి కార్యాలయం చుట్టూ తిరిగే ఇబ్బందులు దూరమయ్యాయి.
మరో రెండు సర్వీసులు అందుబాటులోకి
తాజాగా మరో రెండు కీలక సర్వీస్ లను మీసేవ జాబితాలో పొందుపరిచారు. వివాహ ధ్రువీకరణ పత్రం(Marriage Certificate), మార్కెట్ విలువ(Market Value Certificates) సర్టిఫికెట్లను మీ సేవల ద్వారా పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. జనాభా ప్రాతిపదికన జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివిధ రకాల సర్వీస్ లను అందించేందుకు మీ సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ(Revenue), పురపాలక(Municipalities), పంచాయతీ రాజ్(Panchayat Raj) తదితర శాఖల సేవలు అందిస్తూ, పలు ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తున్నాయి. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర యేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను ఈ కేంద్రాలలో పొందే వెసులుబాటు కల్పించింది. జిల్లాలోని 13 మండలాల్లో 81 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి.
Also Read; AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం.. గెస్ట్ హౌస్‌లో రూ.11కోట్లు
ఇలా పొందాలి
పెళ్లి చేసుకున్న నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం అవసరం పడుతుంది. దీన్ని ఎలా పొందాలో తెలియక కొందరు ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేకంగా ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇప్పుడు ఆ ప్రయాస లేకుండా ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్న వారు సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుక్ చేసు కోవచ్చు. వధూవరులిద్దరికి చెందిన ఆధార్(aadhaar), ఎన్నికల సంఘం(EC) జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు, వయసు రుజువు కోసం పదో తరగతి మెమో, రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలు, ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు అందిస్తే సరిపోతోంది.
మార్కెట్ విలువ ధ్రువపత్రాలు
గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు అవసరమవుతాయి. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మాన్యువల్గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవల ద్వారా అందించనున్నారు. అలాగే ఇసుక(Sand) అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు మీసేవ(Mee Seva)ను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్(Slot Book) చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం మీ సేవల ద్వారా సేవలను మరింత సులభతరం చేస్తోంది. వివాహ ధ్రువీకరణ పత్రం, వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ పత్రాలను అందించే సేవలను ప్రవేశపెట్టింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా మేనేజర్ శివ తెలిపారు.
Also Read: Damodar Rajanarsimha: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. పక్కా ప్లాన్
