Viral Video: దుబాయిలో ఓ హ్యుమనాయిడ్ రోబో.. రోడ్డుకు అడ్డంగా పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అచ్చం మనిషి లాగే ఆ రోబో రహదారిపై పరిగెత్తడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోబోలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఫ్యూచర్ లో వాటి పరిస్థితి ఇలాగే ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో ఏముంది?
దుబాయిలోని ఎమిరేట్స్ టవర్ సమీపంలో ఈ రోబోట్ ను చూసినట్లు.. నజీష్ ఖాన్ అనే వ్యక్తి తెలిపారు. ‘వెల్ కమ్ టు ది ఫ్యూచర్’ క్యాప్షన్ తో రోబో పరిగెడుతున్న దృశ్యాలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రోబో హడావిడీగా రోడ్డును దాటడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే దాని వెనక ఉన్న ఓ వ్యక్తి రోబోను నియంత్రించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..
రోడ్డుపై రోబో పరిగెడుతున్న దృశ్యాలను చూసి.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘రోబోకు అర్జంట్ గా సుస్సు వచ్చిందేమో.. అందుకే హడావిడిగా పరిగెడుతోంది’ అని నెటిజన్ పోస్ట్ పెట్టారు. రోబో ఇంటర్వ్యూకు అటెండ్ అవుతోందని.. అందుకే టెన్షన్ లో ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఈ రోబోట్.. సాంకేతిక ప్రదర్శనకు సిద్ధమవుతూ ఉండొచ్చని మరికొందరు అంచనా వేశారు. అయితే దుబాయిలో ఇలా తరుచూ రోబోలు తారసపడుతున్నట్లు ఓ వ్యక్తి నెట్టింట అభిప్రాయపడ్డాడు.
View this post on Instagram
Also Read: Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల యుద్ధం.. భారత్ సహా ఏ దేశంపై ప్రభావం ఎంత?
హ్యుమనాయిడ్ రోబో అంటే ఏంటి?
హ్యుమనాయిడ్ రోబో అనేది మానవ రూపాన్ని పోలిన రోబోట్. ఇది సాధారణంగా మానవుల శారీరక నిర్మాణాన్ని అనుకరిస్తూ తల, చేతులు, కాళ్లు, ముఖ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రోబోట్లు మానవులతో సహజంగా సంభాషించడానికి, కదలడానికి లేదా పనులు చేయడానికి రూపొందించబడతాయి. హ్యుమనాయిడ్ రోబోలు కృత్రిమ మేధస్సు (AI), సెన్సార్ల సహాయంతో మానవుల వలె నడవడం, మాట్లాడటం, సైగలు చేయడం వంటివి చేయగలవు. ఉదాహరణకు దుబాయ్ వీధిలో కనిపించిన రోబోట్ ఒక హ్యుమనాయిడ్ రోబో. ఇది మానవుల్లా కదలడం ద్వారా ఆకర్షణీయంగా కనిపించింది. ఇవి సాధారణంగా సాంకేతిక ప్రదర్శనలు, పరిశోధనలు, వినోదం లేదా కస్టమర్ సేవలలో ఉపయోగించబడతాయి.