MLAs Disqualification Case( image CREDIT: twittter)
Politics

MLAs Disqualification Case: బీఆర్ఎస్ అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి

MLAs Disqualification Case: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడుతుందని, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా వస్తుందని బీఆర్ఎస్(BRS) భావించింది. కానీ, మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోర్టు సూచనలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లను నిర్ణయించే అధికారంను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు (పార్లమెంట్ ద్వారా) అప్పగించడం ఏకైక ఉద్దేశ్యం న్యాయస్థానాల్లో జాప్యం చేసే వ్యూహాలను నివారించడమేనని పేర్కొంది. అయితే అంతిమంగా స్పీకర్‌కే అధికారం అప్పగించింది. దీంతో గులాబీ పార్టీకి నిరాశే ఎదురైనట్లయింది.

ఆశలు గల్లంతు!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌(Congress)లో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టంకింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ బీఆర్ఎస్(Brs) కేసు వేసింది. అయితే హైకోర్టు సైతం తాము జోక్యం చేసుకోలేమని స్పీకర్‌కే నిర్ణయాధికారం ఉందని పేర్కొంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అయితే స్పీకర్ వద్ద జాప్యం జరుగుతుందని సుప్రీం కోర్టును బీఆర్ఎస్(BRS) ఆశ్రయించింది. 14 నెలలుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు సైతం స్పీకర్‌కే నిర్ణయాధికారం ఉందని, 3నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ ఆశించినదొకటి, తీర్పు ఒకటి రావడంతో పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది.

 Also Read: Fish Venkat: ఫిష్ వెంకట్ చేసిన తప్పు మీరూ చేస్తున్నారా? మీ ప్రాణాలు గాల్లో ఉన్నట్లే?

సీన్ మొత్తం రివర్స్!
పార్టీ మారిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ప్రతి సమావేశంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొంటున్నారు. పార్టీ నేతలు, కేడర్ ఎన్నికలకు సిద్ధంగా కావాలని పిలుపునిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్‌లో ఎవరు పార్టీ మారాలన్నా భయపడేలా చేస్తున్నామని, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయని భావించింది. పార్టీ ఫిరాయింపులు ఎవరు పాల్పడినా వేటు పడుతుందని, అనర్హత వేటుపడుతుందని సంకేతాలు ఇవ్వాలని ఆశించినప్పటికీ సుప్రీంకోర్టు సైతం స్పీకర్‌కే పార్టీ మారినవారిపై వేటు వేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. అయితే స్పీకర్‌కు అధికారులు ఉండటం, అధికార పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్ కావడంతో చట్టంలో పేర్కొన్న అధికారాల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అనర్హత వేటు వేయకుండా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరు ఏ పార్టీలోకి..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు, ఏఐఎఫ్బీ నుంచి ఒకరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అప్పుడు కూడా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ తొలి గవర్నమెంట్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన సైతం కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. అయినా అసెంబ్లీ సమావేశాలకు అనుమతించలేని కోమటిరెడ్డే స్వయంగా గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాత్రం పట్టుపడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పగటి కలలు..!
నాడు ఒక రీతిలో, నేడు ఒక విధంగా వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు సందిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది. సభా హక్కులను కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చింది. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ముందు సుప్రీంకోర్టు తీర్పును చదువుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు పార్టీలను టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్ ది.

రాజ్యాంగ వ్యతిరేక శక్తి బీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. శాసన మండలిలో శాసనసభలో పార్టీలకు పార్టీలను విలీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ఆనాడు స్పీకర్‌కు అధికారాలు ఉంటాయని డంకా బజాయించి చెప్పిన బీఆర్ఎస్ నేతలు, వాళ్ళ విధానాలు నచ్చక పార్టి మారితే వారిపై శాసన సభ్యత్వం రద్దయిందని ఉప ఎన్నికల జరుగుతాయని పగటి కలాలు కంటున్నారని తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సుప్రీం కోర్టు తీర్పు మాత్రం బీఆర్ఎస్‌కు నిరాశే కలిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 Also Read: Mobiles Under Rs 10000: రూ.10వేల బడ్జెట్‌లో తోపు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

Just In

01

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!