Meenakshi Seshadri
ఎంటర్‌టైన్మెంట్

Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

Meenakshi Seshadri: వెటరన్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గురించి ప్రస్తుత జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కాస్త ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళితే మాత్రం.. తన అందంతో కుర్రకారునే కాదు, స్టార్ హీరోలను సైతం ఆమె కుదేల్ చేసింది. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర హీరో ఆమె అందానికి ముగ్ధుడై కొన్నాళ్ల పాటు ఆమెని వదిలి ఉండలేకపోయాడని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సరే.. ఆ విషయంలో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. మీనాక్షి చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా, మంచి ఇమేజ్, గుర్తింపుని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన మీనాక్షి శేషాద్రి.. టాలీవుడ్‌లో మాత్రం ‘ఆపద్భాంధవుడు’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ సినిమాలోని ‘ఔరా అమ్మకుచల్లా’ అనే పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఆ సినిమా తర్వాత దాదాపు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదనే చెప్పుకోవాలి. మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియా వేదికగా ఆమె సందడి చేయడం మొదలెట్టింది.

Also Read- Deva Katta: ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం.. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది

తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో.. ఎవరా అని అంతా ఆరా తీయడం మొదలెట్టారు. ఇంకెవరు మన మెగాస్టార్ సరసన ఆడిపాడిన మీనాక్షి శేషాద్రి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం ఆమె వయసు 61 ప్లస్.. ఈ వయసులో కూడా ఆమె యంగ్‌గా కనిపించి అందరూ అవాక్కయ్యేలా చేశారు. ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన వారు.. ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ ఫొటోలు, వీడియోలు అంతగా వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ముంబైలో జరిగిన కటౌట్ డ్రెస్ ఫ్యాషన్‌పై జరిగిన ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ వేదికకు ఆమె లైట్ బ్రౌన్ కలర్ డ్రస్ వేసుకుని వచ్చారు. ఆమె బ్లో డ్రైడ్ హెయిర్, సాఫ్ట్ బ్రౌన్ మేకప్‌తో ఉన్న ఫొటోలు చూసి కుర్రకారుకు సైతం మతిపోతుందుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారని ఆమెను గోల్డ్‌తో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!

రాబోయే నవంబర్‌లో 62వ ఏట అడుగుపెట్టబోతున్న మీనాక్షి, తనదైన శైలిలో కటౌట్ ట్రెండ్‌ను స్టైల్ చేశారు. ఆమె ధరించిన స్లీవ్‌లెస్ డ్రెస్, నెక్ లైన్, బాడీస్ భాగంలో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ డిటైలింగ్‌తో పాటు, పొట్ట భాగంలో సెమీ-షీర్ కటౌట్‌ పిచ్చెక్కించేలా ఉంది. ఈ డ్రెస్ ఫ్యాంటసీ సొగసుల కలబోతగా ఉంది. దీనికి మెరుపు రాళ్ళతో పాటు అల్లిన త్రెడ్ వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. డ్రెస్ పైభాగం ఫిట్టెడ్‌గా ఉండగా, కింద ఉన్న ఫ్లోర్-లెంత్ సాటిన్ స్కర్ట్ అద్భుతమైన సిల్హౌట్‌ను సృష్టిస్తోంది. అలాగే తన డ్రెస్‌కు మ్యాచింగ్‌గా ఓవర్‌సైజ్డ్ రోజ్ గోల్డ్ ఇయర్‌రింగ్స్, చేతికి ధరించిన రెండు కుందన్ రింగ్స్ ఆమె లుక్‌కు మరింత అందాన్ని అద్దాయి. ఇక ఈ లుక్‌లో ఆమెను చూసిన వారంతా.. ‘ఫెంటాస్టిక్ లుక్… లైట్ మేకప్… కీప్ ఇట్ అప్’ అని ఒకరు, ‘బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ మీనాక్షి’ అని మరొకరు ఇలా కామెంట్ చేశారు. ఇంకో అభిమాని ‘ఏ నాచురల్ బ్యూటీ. మీనాక్షి తన కాలం నాటి ఇతర నటీమణులలాగా తన రూపాన్ని మార్చుకోకుండా, చాలా సహజంగా కనిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు