Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ‘కింగ్‌డమ్’ (Kingdom) చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించారు. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో టీమ్ సంతోషంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్‌గా చాలా బాగుంది అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతుండటంతో పాటు, విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ గురువారం సాయంత్రం థ్యాంక్యూ మీట్‌ని నిర్వహించింది.
Also Read- Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ ఎలా ఉందంటే?
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘కింగ్‌డమ్’ సినిమాకి వస్తున్న స్పందనతో.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. రాత్రి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘కొండన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతుంటే.. చాలా హ్యాపీగా ఉంది. ఇది మీ అందరి ప్రేమ వల్లే సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా ఎప్పటికీ మరిచిపోలేను. నా తెలుగు ప్రేక్షకులు నా వెనుక ఎంతగా ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా ప్రార్థనలు చేశారో, ఇప్పుడు ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నాను. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల, అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్‌ని కూడా త్వరలోనే వచ్చి కలుస్తాను. గురువారం విడుదలంటే మొదట నేను భయపడ్డా. కానీ, నాగవంశీ ఈ సినిమాను నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడాయన నమ్మకమే నిజమైంది. సినిమాకు, నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం మా దర్శకుడు గౌతమ్. టీజర్‌కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
Also Read- Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నా మొట్టమొదటి సక్సెస్ ప్రెస్ మీట్. ఈ రోజు ప్రేక్షకులతో కలిసి ‘కింగ్‌డమ్’ చూశాను. ఈ సినిమాకు, ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఎంట్రీ సీన్‌కు అంతా క్లాప్స్ కొడుకుంటే.. ఆనందం పట్టలేకపోయాను. ఇది ఖచ్చితంగా థియేటర్‌లో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు