kushubhu-patani( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Khushboo Patani: స్వామీజీపై బాలీవుడ్ బ్యూటీ సోదరి విమర్శలు.. ఏం జరిగిందంటే?

Khushboo Patani: ఖుష్బూ పటానీ, బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి, భారత సైన్యంలో మాజీ మేజర్‌గా పనిచేసిన మహిళ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ దేశం, సమాజంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. ఇటీవల, ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహారాజ్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్రంగా ఖంచించారు. అనిరుద్ధాచార్య ఒక సత్సంగ్‌లో, ‘25 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయిలను కుర్రాళ్లు తీసుకొస్తారు, వారు నలుగురితో శారీరక సంబంధం కలిగి ఉంటారు.’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలపై లింగ వివక్షతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ పటానీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, అనిరుద్ధాచార్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘అతను మహిళల గురించి ‘నలుగురితో గడిపి వస్తారు’ అని అన్నాడు. అతను నా ఎదురుగా ఉంటే, ఆ పదం అర్థం ఏమిటో నేను అతనికి వివరించేదాన్ని. ఇలాంటి వ్యక్తులు దేశ వ్యతిరేకులు. ఇటువంటి వారిని సమర్థించకూడదు’ అని విమర్శించింది. ఆమె అనిరుద్ధాచార్య అనుచరులను ‘నీచమైన వారు’ అని సంబోధిస్తూ, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని, అదే సమయంలో పురుషుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. ఆమె మాటల్లో, ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మహిళ ఒంటరిగా ఉంటుందా? పురుషులు కూడా దానిలో భాగం కాదా? లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటంలో తప్పేమిటి?’ అని ప్రశ్నించింది.

Read also- Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!

వివాదం ఏంటంటే?

అనిరుద్ధాచార్య, వృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయంతో సంబంధం కలిగిన ఒక ఆధ్యాత్మిక గురువు. తన సత్సంగ్‌లలో శ్రీకృష్ణ భక్తి, హిందూ సంస్కృతి గురించి ప్రవచనాలు చేస్తారు. ఇటీవల, ఒక సత్సంగ్‌లో ఆయన లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గురించి మాట్లాడుతూ, ‘25 ఏళ్ల అమ్మాయిలను కుర్రాళ్లు తీసుకొస్తారు, వారు అప్పటికే నలుగురితో గడిపి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్త్రీలను అవమానపరిచే విధంగా, లింగ వివక్షతతో కూడినవిగా భావించబడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, మహిళా హక్కుల కార్యకర్తలు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మథురాలోని బార్ అసోసియేషన్ ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read also- Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ!

ఖుష్బూ పటానీ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. డీఐటీ స్కూల్ ఆఫ్ ఇంజీనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఆమె 11 సంవత్సరాల పాటు భారత సైన్యంలో సేవలు అందించి, 2024లో మేజర్ ర్యాంక్‌తో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్, న్యూట్రిషనిస్ట్, మెడిటేషన్ ఇన్‌స్ట్రక్టర్, స్పిరిచువల్ హీలర్‌గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అధిక సంఖలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఆమె సోదరి దిశా పటానీ ఆమెను ‘వండర్ వుమన్’ అని ప్రేమగా సంబోధిస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?