Kiara Advani: యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ నుంచి తొలి పాట “ఆవన్ జావన్” తెలుగులో ‘ఊపిరే ఊయలగా’ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా జులై 31న విడుదలైంది. ఈ రొమాంటిక్ సాంగ్‌లో హృతిక్ రోషన్, కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ, ఇటలీలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను అరిజిత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించగా, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. కానీ, ఈ పాటలో కియారా అద్వానీ లుక్‌పై రెడ్డిట్‌లో హాట్ డిస్కషన్ నడుస్తోంది! రెడ్డిట్ యూజర్లు కియారా బికినీ లుక్‌ను దీపికా పదుకొణె పఠాన్ సినిమాలోని లుక్‌తో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. “దీపికా లైట్ వెర్షన్”, “దీపికా ప్లస్ ఆదితి రావ్ హైదరీ” అంటూ కొందరు, మరికొందరు “ఇద్దరూ అద్భుతంగా ఉన్నారు” అని ప్రశంసించారు. అయితే, కొందరు సోషల్ మీడియా యూజర్లు హృతిక్ కియారా మధ్య కెమిస్ట్రీ మిస్సింగ్‌గా ఉందని, 18 ఏళ్ల వయసు తేడాపై చర్చించారు. ఈ పాటలో కియారా యెల్లో బికినీ, ఆఫ్-షోల్డర్ డ్రెస్‌లో ఆకట్టుకోగా, హృతిక్‌తో ఇటలీ వీధుల్లో ఐస్‌క్రీమ్ షేర్ చేసుకుంటూ, పూల్‌సైడ్ రొమాన్స్‌లో మునిగారు. ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. కియారా పాత్ర కవ్య లూథ్రా, ఆర్‌ఏడబ్ల్యూ అధికారి కూతురుగా ఉండొచ్చని రెడ్డిట్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read also- Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. ముంబైలో జన్మించిన బాలీవుడ్ నటి. 2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ‘కబీర్ సింగ్’ (2019), ‘షేర్‌షా’ (2021), ‘భూల్ భులయ్యా 2’ (2022) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘భరత్ అనే నేను’ (2018) ‘వినయ విధేయ రామ’(2019) చిత్రాల్లో నటించింది. ‘వార్ 2’లో ఆమె హృతిక్ రోషన్తో రొమాంటిక్ పాత్రలో కనిపిస్తోంది. ఆమె నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, ప్రీతమ్ సంగీతంలో, అరిజిత్ సింగ్ గాత్రంతో విడుదలైన ‘ఊపిరి ఊయలగా’ పాటలో ఆమె కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.
Read also- Malegaon Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. బీజేపీ మాజీ ఎంపీ సహా అందరూ నిర్దోషులే
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’ నుంచి మొదటి ట్రాక్ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ‘ఊపిరి ఊయలలాగా’ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’లోని బ్లాక్‌బస్టర్ పాట ‘కేసరియా’ పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మించిన ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.