Alcohol Seized (IMAGE credit: swetcha reporter)
క్రైమ్

Alcohol Seized: స్థానిక ఎన్నికల కోసం తరలిస్తుండగా సీజ్

Alcohol Seized: గోవా ట్రిప్‌నకు వెళ్లిన ఓ వ్యక్తి, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా మద్యం కొనుగోలు చేసి కారులో తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా అడిసెపల్లి గ్రామానికి చెందిన జయంత్ రెడ్డి(Jayanth Reddy)ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో గోవా పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించి, తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరే సమయంలో, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది.

 Also Read: Isha koppikar: ఆ సీన్ కోసం నాగార్జున నన్ను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారు.. ఈషా కొప్పికర్ కామెంట్స్ వైరల్

నిందితుడిపై కేసులు నమోదు

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జయంత్ రెడ్డి, ఓటర్లకు పంచిపెట్టడం కోసం 112 ఫుల్ బాటిళ్లు, 50 హాఫ్ బాటిళ్ల మద్యాన్ని కొనుగోలు చేశాడు. దాంతోపాటు 330 ఎంఎల్ బీరు బాటిళ్లను కూడా తీసుకున్నాడు. వాటిని తన కారులో జాగ్రత్తగా దాచి హైదరాబాద్‌(Hyderabad)కు బయలుదేరాడు. అయితే, జహీరాబాద్‌లోని చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద సంగారెడ్డి డీటీఎఫ్ టీం ఎస్ఐ హన్మంతు, జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులతో కలిసి కారును ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో భారీగా ఉన్న గోవా మద్యం సీసాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

 Also Read: Minister Ponnam Prabhakar: ఉప ఎన్నికపై మంత్రి సంచలన కామెంట్స్!

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ