isha koppikar: టాలీవుడ్, బాలీవుడ్‌లలో హిట్ సినిమాలలో నటించి తన నటనతో మంచి గుర్తింపు పొందిన నటి ఈషా కొప్పికర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, ఇటీవలే ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Also Read: Samantha: ఆ ఛాలెంజ్ లో సమంత గెలిచింది.. ఒక్క దెబ్బతో అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టేసిందిగా!
1998లో రిలీజ్ అయిన తెలుగు చిత్రం చంద్రలేఖ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ షూటింగ్‌లో జరిగిన ఒకషాకింగ్ సంఘటనను ఆమె గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. ఈ మూవీలో నాగార్జున అక్కినేనితో కలిసి నటించిన ఈషా, ఒక సీన్ కోసం నాగార్జున తనను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారని. దాని వలన తన ముఖంపై గుర్తులు పడ్డాయని చెప్పింది.
Also Read: BRS KCR: సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి.. పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం!
హిందీ రష్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఈషా ఈ విషయాన్ని పంచుకుంది. చంద్రలేఖ ఆమె రెండో సినిమా కావడంతో, యాక్టింగ్‌కు కట్టుబడి ఉన్న ఈషా, ఒక సీన్‌లో కోపం చూపించాల్సి ఉండగా, ఆ ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా చూపించడానికి నాగార్జునను నిజంగా చెంపదెబ్బ కొట్టమని అడిగిందట. “నేనుఈ సీన్ ను నిజంగా చేయాలనీ అనుకుంటున్నాను, మీరు నిజంగానే నా చెంప మీద కొట్టండి” అని అడగగా, నాగ్ మొదట్లో సున్నితంగా కొట్టారు, కానీ నేను ‘నాకు ఆ ఫీలింగ్ రావాలి, ఇంకా గట్టిగా కొట్టండి’ అని చెప్పాన,” అని ఈషా చెప్పుకొచ్చింది.
Also Read: BRS Party Leaders: గ్రామస్థాయి బీఆర్ఎస్‌లో గ్రూపులు.. ఎమ్మెల్యేలు మాజీల అనుచరులదే పెత్తనం!
అయితే, ఆమె కోపం యొక్క ఎక్స్‌ప్రెషన్‌ను సరిగ్గా రావడం లేదని, దర్శకుడు కృష్ణ వంశీ చెప్పడంతో, ఆ సీన్‌ను 14 సార్లు రీటేక్ చేశారట. “కోపం చూపించడానికి ప్రయత్నిస్తూ, నేను 14 సార్లు చెంపదెబ్బలు తిన్నాను. చివరికి నా ముఖంపై నిజంగానే గుర్తులు పడ్డాయి,” అని ఈషా చెప్పింది. సీన్ అయి పోయాక నాగార్జున ఆమెకు సారీ చెప్పగా, “నేనే కొట్టమని చెప్పాను, నీవు సారీ ఎందుకు చెప్పాలి?” అని సమాధానమిచ్చింది.