Congress - AIMIM ( image CredIt: twitter)
Politics

Congress – AIMIM: కాంగ్రెస్‌కు ఎంఐఎం బిగ్ ట్విస్ట్.. జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఏఐసీసీ ఫైనల్ సర్వే

Congress – AIMIM: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతుపై ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, (CONGRESS) ఎంఐఎం(MIM)ముఖ్య నేతల మధ్య రెండుసార్లు మద్ధతు అంశంపై చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముస్లిం మైనార్టీ నేతకు బీ ఫామ్ ఇస్తేనే మద్ధతు ఇస్తామని ఎంఐఎం (MIM)తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పలు సమీకరణాలను ఎంఐఎం తనదైన శైలీలో కాంగ్రెస్ పార్టీకి వివరించిందట.

ముస్లిం మైనార్టీ నేతకు టిక్కెట్ ఇవ్వడం వలన కలిసి వచ్చే అంశాలు, సునాయసంగా విజయం, ఆ తదుపరి పరిణామాలు వంటివన్నీ ఎంఐఎం తన ఇంటర్నల్ సర్వే వివరాలను కాంగ్రెస్‌ (CONGRESS)కు అందజేసింది. దీంతో అభ్యర్ధి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి చాలా మంది కీలక నేతలు రేసులో నిలుస్తున్న నేపథ్యంలో ఫిల్టర్ చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. ఒకటి రెండు రోజుల్లో పీసీసీ కూడా జూబ్లీహిల్స్(జూబ్లీహిల్స్ (Jubilee Hills)నియోజకవర్గం అభ్యర్ధిపై తన అభిప్రాయాన్ని హైకమాండ్‌కు చెప్పనున్నారు.

 Also Read: Indian Sperm Tech Center: శాంపిళ్లు సేకరించిన క్లూస్ టీం.. ఏజెంట్లతో స్పెర్మ్​ కలెక్ట్ చేసిన నిందితులు

అజారుద్దీన్‌కే మెజార్టీ నేతల మద్ధతు?
గతంలో జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌కే ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. తనకున్న పాత పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు వంటివన్నీ ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారాయి. పైగా ఎంఐఎం కూడా ముస్లింకే ఇవ్వాలని పట్టుపడుతున్న నేపథ్యంలో అజారుద్దీన్ టిక్కెట్‌కు మరింత ఈజీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేషన్ చైర్మన్ ఫయిమ్ ఖురేషీ కూడా తన దైన శైలీలో ఏఐసీసీ లెవల్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి వీరిద్దరి పేర్లు బలంగా వినిపిస్తుండగా, అజారుద్దీన్‌కే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ నేతలు వివరిస్తున్నారు.

మంత్రి పదవికీ లైన్ క్లియర్?
జూబ్లీహిల్స్ (Jubilee Hills నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ(Congress party)నుంచి పోటీ చేసిన ముస్లిం మైనార్టీ నేత విజయం సాధిస్తే, మంత్రి పదవి కూడా కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.వాస్తవానికి క్యాబినెట్‌లో ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ వర్గానికి చోటు కల్పించలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఆ వర్గం నుంచి గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్ అంటూ గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. పార్టీ, ప్రభుత్వానికి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా భర్తీ చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో జూబ్లీహిల్స్‌పై అజారుద్దీన్ సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలిస్తే గెలుపు ఈజీగా మారే ఛాన్స్ ఉన్నట్లు పార్టీకి చెందిన సర్వేల్లోనూ తేలింది.

ఫైనల్ సర్వే పూర్తి?
జూబ్లీహిల్స్ని(Jubilee Hills)యోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ(Congress party) వివిధ దశల్లో సర్వే చేసింది. సుమారు 3.87 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కోసం క్షుణ్ణంగా స్టడీ చేసింది. ఏఐసీసీ ఆధ్వర్యంలోని టీమ్స్ మూడుసార్లు వివిధ దశల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఫిల్టర్ చేశాయి. ఈ సర్వేల్లోనే అజారుద్దీన్, నవీన్ యాదవ్, పీజేఆర్ కూతురు విజయారెడ్డికి పబ్లిక్ నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఎంఐఎం కోరినట్లు ముస్లిం నేతకే ఇవ్వాల్సి వస్తే, అజారుద్దీన్‌కు టిక్కెట్ కన్ఫామ్ అవుతుంది. పైగా 2023 ఎన్నికల్లో 64,212 ఓట్లు సాధించిన నేపథ్యంలో, ఈ దఫా తన గెలపు ఖాయం అంటూ అజారుద్దీన్ పార్టీ పెద్దలకు వివరిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ ఓ నివేదిక రూపంలో ఏఐసీసీకి సర్వే టీమ్స్ హైకమాండ్‌కు పంపనున్నాయి.

Also Read: Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!