Talasani Srinivas Yadav: ఆగస్టు 8న కరీంనగర్‌లో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav:) ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో బీసీ ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూ వస్తోందన్నారు. బీఆర్ఎస్ తరపున త్వరలో బీసీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలుస్తుందన్నారు.
Also Read: CM Revanth Reddy: నగరంలో కాలుష్య నివారణపైనే ప్రధానంగా చర్చ
కాంగ్రెస్ కొత్త డ్రామా
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నారు. ‘ ఓట్ల కోసమే కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చింది. పారదర్శకత లేకుండా ప్రభుత్వం కులగణన జరిపింది. హడావుడిగా అసెంబ్లీలో బిల్లును ప్రభుత్వం పెట్టింది. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామనడం రాజ్యాంగ విరుద్ధం. 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాం. అమలు కాదని తెలిసే కాలయాపన చేస్తూ కాంగ్రెస్ మభ్య పెడుతోంది. ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ కాంగ్రెస్ కొత్త డ్రామాకు కుట్ర లేపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి’ అని తలసాని విమర్శలు గుప్పించారు.
Also Read: Robbery in Shadh nagar: దొంగలకే దొంగ డిఫరెంట్ దొంగ.. ఆమ్లెట్ వేసుకొని మరి!