Supreme Court: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఓ భూ వివాదంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు(Supreme Court) ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పిటిషనర్‌తోపాటు అతడి తరపు న్యాయవాదికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. గోపన్‌పల్లి సర్వే నెంబర్ 127లో ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటీవ్ సొసైటీకి చెందిన 31 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడిచిన విషయం తెలిసిందే.
Also Read: Viral Video: విచిత్ర ప్రమాదం.. రివర్స్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు..!
రాజకీయ దురుద్దేశంతోనే
కాగా, రేవంత్ రెడ్డి(Revath Reddy) ప్రోద్భలంతో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరుడు లక్ష్మయ్య ఈ భూమిలోకి దౌర్జన్యంగా చొరబడినట్టు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఈ కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టి వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొంతకాలం క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేవు
గొడవ జరిగిందని చెప్పిన రోజున అసలు తాను అక్కడ లేనని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు ఇటీవల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై నమోదు చేసిన కేసులను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ పెద్దిరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలతోపాటు జడ్జి పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ఆదేశాలు జారీ
పెద్దిరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో పిటిషన్‌లో పెద్దిరాజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దిరాజుతో పాటు ఆయన తరపు న్యాయవాది రితీష్ పాటిల్‌లకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పెద్దిరాజు తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కేసును విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా దానికి ధర్మాసనం నిరాకరించింది. సమాధానం ఆమోద యోగ్యంగా ఉంటేనే దానిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: Priyanka Gandhi: సోనియా గాంధీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కౌంటర్