Minster Vivek: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకవచ్చామని మంత్రి వివేక్(Min Vivek) అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్‌లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల లబ్ధిదారులకు, అలాగే చిన్నకోడూరు, నారాయణరావు పేట, నంగునూరు మండలాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి వివేక్ వెంకట స్వామి ఎస్సీ(SC) ఎస్టీ(ST) కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Bakki Venkataiah), జిల్లా కలెక్టర్ హైమవతి(Collector Haimavati) లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రేషన్ కార్డుల కోసం 12ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నారన్నారు. 12ఏండ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్ల తరహాలోనే ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేట(Sidhipeta) జిల్లా కు 10వేల ఇందిరమ్మ ఇండ్లు(Indiramma’s houses) మంజూరు చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ
నేడు సుమారు 10వేల రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుతో పాటు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం 9వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఖజానా ఖాళీ అయిన కూడా ప్రజల కోసం వడ్డీ లేని రుణాలు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఓట్ల సమయంలో మాత్రమే నిధులు విడుదల చేసేవారనీ, సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవచ్చేయాలనే అలోచించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ప్రవేశపెట్టారనీ, దానిలో ఒకటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులను ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. సిద్దిపేట అర్బన్ రూరల్ మండలాలకు దాదాపు 10 వేల కార్డులు అందిస్తున్నామన్నారు.
Also Read: Lok Sabha: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో విదేశాంగమంత్రి జైశంకర్ కీలక ప్రకటన
అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా పాత రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల చేర్పులు, కొత్త కార్డులు కలిపి 52 వేల మందికి అదనంగా లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యంను లబ్ధిదారులు వాడలేదు. కానీ పేద ప్రజలకు రుచికరమైన పౌష్టికహారం అందించాలినే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్ల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. 200 రూపాయలకే ఫ్రీ కరెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ అనేక పథకాలు ఈ కార్డుల ద్వారా అందించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి 8 లక్షల కోట్ల రూపాయల రుణాలున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆపలేదని మంత్రి చెప్పుకొచ్చారు. వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజి రుణాలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని చూసి ఇతర రాష్టలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
సిద్దిపేట నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామన్నారు. క్యాబినెట్ మీటింగ్ లో సీఎం(CM) అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా, ఇండ నిర్మాణం వేగంగా పూర్తయ్యాల పరిరక్షించాలన్నారు. అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిది జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు. జిల్లా కలెక్టర్ కె.హైమావతి(Collector Haimavati) మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలనుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం ఇప్పుడు అందిస్తుందన్నారు. జిల్లాలో 26 వేల కొత్త రేషన్ కార్డ్‌ల పంపిణీ జరుగుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 9971 కొత్త కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్డులలో 30 వేల మంది సభ్యులున్నారన్నారు. 21300 సభ్యులకు పాతకార్డులలో చేర్చడం జరిగినదనీ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా ఇన్చార్జి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగర్వాల్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, డిఎం సివిల్ సప్లై ప్రవీణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Also Read: Minister Jupally Krishna Rao: భద్రాచలం మరింత అభివృద్ధి.. ప్రతిపాదనలు సిద్ధం
