Weight Loss Tips (Image Source: Instagram)
Viral, లేటెస్ట్ న్యూస్

Weight Loss Tips: అలా ఉన్నవారు.. ఇలా అవ్వాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో కావాల్సిందే!

Weight Loss Tips: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య చాలా మందిని వెంటాడుతోంది. శరీరంలో ఏ రోజుకారోజు పేరుకుపోతున్న కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే బెక్కా (Becca) అనే మహిళ తేలికపాటి పద్దతుల్లో ఏకంగా 35 కేజీల బరువు తగ్గి అందరికీ షాకిచ్చింది. ఎక్స్ఎల్ (XL) సైజ్ నుంచి ఎక్స్ఎస్ (XS)కు తగ్గిపోయింది. అయితే బరువు తగ్గేందుకు తను అనుసరించిన ఐదు సులభతరమైన మార్గాల గురించి ఆమె ఇన్ స్టాగ్రామ్ (Instagram) వేదికగా పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. వ్యాయామాన్ని ఉద్యోగంలా చూడాలి
రోజు చేసే వ్యాయమాన్ని ఒక ఉద్యోగంలా చూడాలని బెక్కా అన్నారు. ‘మీరు రోజూ హాజరు కాకపోతే జీతం రాదు. వ్యాయామాన్ని ఆఫీసు మీటింగ్ లా భావించండి. ఆ సమయంలో ఎవరైనా మీకు కాల్ చేసినా, మీరు బిజీ అనండి’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పుకొచ్చారు. ఈ మైండ్‌సెట్ వల్ల తాను విరామం లేకుండా నిరంతరం వ్యాయామం చేయగలిగానని చెప్పుకొచ్చారు.

2. నెలకు ఒకసారి బరువు కొలుచుకోండి
‘తూకం కొలిచే స్కేలు అబద్ధం చెబుతుంది. అది నీ భావాలను దెబ్బతీస్తుంది. బరువు అనేది శరీరంలోని నీటివల్ల, హార్మోన్ల వల్ల లేదా కండరాల పెరుగుదల వల్ల మారవచ్చు. కాబట్టి నెలకు ఒక్కసారి మాత్రమే బరువు చెక్ చేసుకోండి’ అంటూ బెక్కా సలహా ఇచ్చారు.

3. సపోర్ట్ సిస్టమ్ ఏర్పరచుకోవాలి
‘మరథాన్ పరుగులు పెట్టే ఫ్రెండ్స్ అవసరం లేదు. మీలాంటి ఆలోచన కలిగిన వారితో ఉండండి. నాకు ఈ మద్దతు గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసుల ద్వారా వచ్చింది. తోటి స్నేహితులు కష్టపడి చేస్తుంటే తానూ మరింత కష్టపడాలన్న స్ఫూర్తి కలుగుతుంది’ అని బెక్కా రాసుకొచ్చారు.

4. ఇష్టమైన ఆటలు ఆడండి
బరువు తగ్గడంలో వ్యాయమం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగనీ రోజు కఠినమైన వ్యాయమం చేయాల్సిన పనిలేదని బెక్కా అన్నారు. ‘హైకింగ్, వాకింగ్ లేదా పికిల్‌బాల్ వంటి ఆటలు సరిపోతాయి. శరీరం కదలిక ఆనందంగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చారు.

Also Read: Amit Shah: ఆపరేషన్ మహాదేవ్‌‌ను కళ్లకు కట్టిన అమిత్ షా.. లోక్ సభలో అదిరిపోయే స్పీచ్!

5. ఏదైనా తినొచ్చు.. కానీ!
చాలామంది బరువు తగ్గేందుకు ఫుడ్ మానేస్తుంటారు. ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకుంటారు. అయితే నచ్చిన ఆహారం తినొచ్చని బెక్కా చెబుతోంది. నేను ఫాస్ట్ ఫుడ్, కార్బోహైడ్రేట్లు, తీపి వస్తువులు ఏదీ మానలేదు. అయినప్పటికీ బరువు తగ్గాను. అయితే తినే వాటిపై నియంత్రణ అవసరం’ అని బెక్కా సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by Becca (@flexxwithbex)

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?