Kaka You Just Give Re Entry
స్పోర్ట్స్

Kohli Offer: కాకా నువ్వు రీ ఎంట్రీ ఇవ్వు చాలు..!

Kaka You Just Give Re Entry: యూనివర్సల్ ప్లేయర్, వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్‌కు ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని కొహ్లీ కోరాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. వెటరన్ ప్లేయర్ల కోసమే తెచ్చారని, ఫీల్డింగ్ చేయకున్నా బ్యాటింగ్ చేస్తే సరిపోతుందని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తర్వాత ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన క్రిస్ గేల్‌తో కొహ్లీ సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపింది.చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో 27 రన్స్‌తో గెలిచిన ఆర్‌సీబీ, మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కి చేరింది. సీఎస్‌కేను 20 ప్లస్ రన్స్‌తో ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ, యశ్‌దయాల్ సంచలన బౌలింగ్‌తో అనుకున్న రిజల్ట్స్‌ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ, జడేజా చివరి వరకు పోరాడినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుతంగా పుంజుకుంది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆ జట్టు సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి అనూహ్య పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్‌కి చేరింది. దాంతోనే ఆర్‌సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచినంత సంబరాలు చేసుకున్నారు.

Also Read: ఏడ్చేసిన రాయుడు, ఎందుకంటే..?

బెంగళూరు వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌కు క్రిస్ గేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆర్‌సీబీకి మద్దతు తెలిపాడు. విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆర్‌సీబీ ఆటగాళ్లతో సరదా గడిపి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూమ్‌లో రావడం చూసి కోహ్లీ తనదైన శైలిలో కామెంట్రీ చెప్పాడు. యూనివర్సల్ బాస్ తన రాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్‌లో 37 సిక్స్‌లు కొట్టాను. కాకా వచ్చే ఏడాది రీఎంట్రీ ఇవ్వు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. నువ్వు ఫీల్డింగ్ చేయాల్సిన పనిలేదు. ఈ రూల్ నీకోసమే రూపొందించారని కోహ్లీ తెలిపాడు.చాలా సేపు ఆర్‌సీబీ ఆటగాళ్లతో సరదాగా గడిపిన క్రిస్‌గేల్‌కు ప్లేయర్ల సంతకాలతో కూడిన విరాట్ కోహ్లీ జెర్సీని బహుమతిగా అందజేశారు.

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు