CM Revanth
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth: బీసీ రిజర్వేషన్ విషయంలో తగ్గేదే లే!

CM Revanth: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ధర్నాతో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు, మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతు కోరేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమాలకు రాష్ట్ర నుంచి పార్టీలకు అతీతంగా బీసీ లీడర్లను ప్రభుత్వం ఢిల్లీకి ఆహ్వానించింది. బీసీ సంఘ నాయకులకూ పిలుపునిచ్చింది. ఆగస్టు 5న దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ బృందం వినతిపత్రాలు ఇవ్వనున్నది. మరుసటి రోజు 6న జంతర్ మంతర్‌లో రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం నేతృత్వంలో ధర్నా చేయనున్నారు. 7న కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలను కలసి 42 శాతం రిజర్వేషన్‌కు మద్ధతు ఇవ్వాలని కోరనున్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 5 గంటల పాటు బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. కేంద్రం ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే, రిజర్వేషన్లను ఎలా సాధించుకోవాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేబినేట్ అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖలు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.

రండి.. సాధించుకుందాం!

బీసీలకు 42 శాతం అమలు చేసే దానిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని మంత్రులు పేర్కొన్నారు. ఎంపీరికల్ డేటా ఆధారంగా రెండు బిల్లులను రాష్టపతికి పంపించామన్నారు. రిజర్వేషన్ల క్యాప్‌ను తొలగించేందుకు గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపించామన్నారు. వీటిపై ఇప్పటి వరకూ గ్రీన్ సిగ్నల్ రాకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం చొరవ చూపిస్తుంటే, కేంద్రం సతాయించడం సరికాదన్నారు. దీంతోనే ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేపీలోని 5 మంది బీసీ ఎంపీలు కూడా తమతో కలిసి రావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు మేధావులు, ప్రజాసంఘాలు కూడా ఢిల్లీ బాట పట్టాలన్నారు. ఒక వైపు బిల్లు సమయం దాటిపోతుండగా, మరోవైపు కోర్టు తీర్పు దగ్గరకు వస్తోంని, ఇప్పటి వరకూ రాష్ట్రపతి, గవర్నర్‌లు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం తయారు చేసిన ఎంపీరికల్ డేటా వలన ఎవరికి నష్టం లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా పారదర్శకంగా సర్వే జరగడం ఇదే మొదటిసారి అని మంత్రులు వెల్లడించారు. బీజేపీ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని, కాళ్లల్లో కట్టెలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి, ఢిల్లీలో డబుల్ గేమ్ ఆడటం సరికాదన్నారు. బీజేపీ ఎంపీలు మద్ధతిచ్చేలా నేరుగా రాష్ట్రపతి సూచిస్తే ఇంకా బాగుంటుందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విఫలం కాదని వెల్లడించారు.

Read Also- World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?

కేసీఆర్ మోసం..

గతంలో పదేండ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీసీలకు తీరని ద్రోహం చేశారన్నారు. అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారన్నారు. కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. కేసీఆర్ బీసీలకు చేసిన ద్రోహాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జూలై10న జరిగిన కేబినేట్ మీటింగ్‌లో ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకున్నదన్నారు. చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించిందన్నారు. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్‌ను జూలై 14న ప్రభుత్వం గవర్నర్‌కు పంపించిందన్నారు. ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు.

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు రద్దు

రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు. రాష్ట్ర సరిహదుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయని, జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సూచించిందన్నారు. చెక్ పోస్టులు సిబ్బంది కాకుండా ఇకపై వాహన్, అడ్వాన్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుందన్నారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్‌లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.

Read Also- Hormones Imbalance: స్త్రీలలో టాప్ 5 హార్మోన్లు.. ఇంబ్యాలెన్స్ అయితే చుక్కలే..!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..