Minister Jupally Krishna Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Jupally Krishna Rao: భద్రాచలం మరింత అభివృద్ధి.. ప్రతిపాదనలు సిద్ధం

Minister Jupally Krishna Rao: ఏకో, టెంపుల్‌ టూరిజంలను ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao), జూపల్లి కృష్ణారావు(Min Jupally krishna Rao) అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి పరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని అన్నారు. సచివాలయంలో టూరిజం కార్పొరేషన్‌ ఎండీ వల్లూరి క్రాంతి(Kranthi), జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలేరు రిజర్వాయర్‌(Paleru Reservoir), నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం(Buddhist stupa), పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌, కిన్నెరసాని ప్రాజెక్టు(Kinnerasani Project), కొత్తగూడెం వద్ద హరితహోటల్‌, కనిగిరిహిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయం
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయం(Bhadrachalam Rama Temple)ను మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇందుకు టూరిజం డిపార్టుమెంట్‌, కార్పొరేషన్‌లు కృషి చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు.

Also Read: Ramchander Rao: పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు: రాంచందర్ రావు

అటవీ ప్రదేశంలో ఏకో టూరిజం
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రదేశంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా ఉమ్మడి జిల్లా ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, కొత్తగూడెం(Kothagudem)లో ఉన్న హరిత హోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Also Read: NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..