Medchal highway: జాతీయ రహదారి, ఆ పక్కనే బస్టాండ్ ఉంటే ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అక్కడి నుంచి కాలనీలోకి ప్రవేశించే రోడ్డు కబ్జా గురైతే పరిస్థితి ఏంటి? మేడ్చల్(Medchal) పట్టణంలో జాతీయ రహదారి పక్కన భవనాన్ని నిర్మించిన యజమాని కాలనీకి వెళ్లే రోడ్డును ఆక్రమించుకుని, నిర్మాణం చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ప్రజలకు శాపంగా మారింది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్-తూప్రాన్ వెళ్లే రోడ్డులో 44వ జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ(RTC) బస్టాండ్‌కు ఎదురుగా వినాయక్ నగర్ 1, 2 కాలనీలు వెలిశాయి. దాదాపు 30 ఏండ్ల కిందటి లేఔట్ ఆది. వినాయక్ నగర్ రోడ్డు నెంబరు 1 అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉండగా, వినాయక్ నగర్ రోడ్డు నెంబరు 2 బస్సులు బస్టాండ్ లోనికి వెళ్లే చోటుకు ఎదురుగా ఉంది.
50 సర్వే నెంబరులో చేసిన ఆ లేఔట్‌లో వినాయక్ రోడ్డు నెంబరు 1ను 32 ఫీట్లుగా చూయించారు. మొదట్లో జనాభా తక్కువగా ఉండటం వాహనాల రద్దీ అంతగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ కాలక్రమేణ జనాభా, వాహనాల రాకపోకలు పెరిగాయి. బస్టాండ్ పక్కనే కాలనీ ఉండటంతో వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు నివాస గృహాలు పెద్ద ఎత్తున వెలిశాయి. వినాయక్ కాలనీ రోడ్డు నెంబరు 1 జాతీయ రహదారిని కలిసే చోట జాతీయ రహదారి పక్కన వాణిజ్య భవనం వెలిసింది.
ఆక్రమణను పెంచుతూ పోయాడు
ఆ భవన యజమాని జాతీయ రహదారి నుంచి వినాయకనగర్ కాలనీ రోడ్డు ప్రారంభమయ్యే చోట సెల్యూలార్‌లో నిర్మించిన షట్టర్లలోనికి వెళ్లేందుకు మెట్లు నిర్మించుకున్నాడు. మొదట్లోనే 2 ఫీట్లు ఆక్రమించుకొని, మెట్లు నిర్మించడంతో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఆ తర్వాత క్రమ క్రమంగా ఆక్రమణను పెంచుతూ పోయాడు. తాజాగా సెల్యూలార్ లో నిర్మించిన షట్టర్ల ముందు సెప్టిక్ ట్యాంక్(Septic tank) నిర్మాణాన్ని చేపట్టాడు. దీంతో రోడ్డు 32 ఫీట్లలో నుంచి 7 ఫీట్లు కబ్జాకు గురైందని కాలనీవాసులు తెలిపారు. 32 ఫీట్ల నుంచి 25 ఫీట్లకు రోడ్డు కుచించుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. బస్టాండ్‌లో బస్ దిగిన ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పట్టణంలోకి వెళ్లేందుకు ఈ రోడ్డునే ఎక్కువగా వినియోగిస్తారు.
Also Read: Haridwar Stampede: మానస దేవి ఆలయంలో ఘోర విషాదం.. ఏడుగురి మృతి
ద్విచక్ర వాహనాలతో పాటు పెద్ద వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు కుచించుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. అంతేకుండా భవనం ముందు టిఫిన్ సెంటర్ నిర్వహించడం మరింత ఇబ్బందిగా మారింది. బస్టాండ్ ముందే టిఫిన్ సెంటర్ ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగదారులు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. పార్కింగ్కు స్థలమే లేని చోట వాహనాలను పార్కింగ్ చేయడం హోటల్(Hotel) నిర్వాహకులు చెత్త చెదారం వేసేందుకు నీళ్ల డ్రమ్ములను పెట్టడంతో ట్రాఫిక్ కు మరింత ఇబ్బంది ఏర్పడుతోంది.
చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్
బస్టాండ్ ముందు వినాయక్ కాలనీ రోడ్డు నెంబరు 1లో రోడ్డు కబ్జాపై నోటీసులు ఇచ్చాం. వారం రోజుల తర్వాత నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, కాలనీవాసుల నుంచి కూడా ఫిర్యాదు చేశారని అన్నారు. రోడ్డు కబ్జాకు గురి అవడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారని, ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమీషపర్ అన్నారు.
కబ్జాను తొలగించాలి : రవికుమార్
వినాయక్ రోడ్డు నెంబరు 1లో కబ్జాను వెంటనే తొలగించాలి. రోజు రోజుకు పెరుగుతున్న రద్దీ కారణంగా 25 ఫీట్లు రోడ్డు సరిపోవడం లేదంటూ, కాలనీలోకి తాము వెళ్లడమే కాకుండా పట్టణంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రోడ్డును వినియోగిస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీ కమిషనర్‌కు కబ్జాపై ఫిర్యాదు చేశామని, మున్సిపాలిటీ అధికారుల నుంచి స్పందన లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాంమని కాలనీవాసులు తెలిపారు.
Also Read: Tourist Guide: టూర్లకు వెళ్తున్నారా.. ఈ మోసాల గురించి తెలుసుకోండి.. లేదంటే మీ పని ఔట్!