War 2 Movie Still
ఎంటర్‌టైన్మెంట్

War2: ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా ఎవరిదో తెలుసా?

War2: పాన్ ఇండియన్ స్టార్స్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తుండటంతో పాటు, ఫస్ట్ టైమ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా? అని వెయిట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ట్రైలర్ అలాంటి మూడ్‌ని వారికి తెప్పించింది.

ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం చూస్తుంటే, ఈ సినిమా కోసం ప్రేక్షకలోకం ఎంతగా వెయిట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు హీరోలు ఈ ట్రైలర్‌లో ఫెరిషియస్ లుక్‌లో కనిపించి, అందరినీ ఆకర్షించారు. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి హీరోల మధ్య సాగే యాక్షన్ సీక్వెన్స్ ఈ ట్రైలర్‌కు హైలైట్. విజువ‌ల్స్‌, బీజీఎమ్‌ ట్రైలర్ చూస్తున్న ప్రేక్షకులకు గూస్ బంప్స్‌ను క‌లిగిస్తుండటంతో.. ఈ ట్రైల‌ర్‌ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని రెట్టింపు చేయడంలో సక్సెస్ అయినట్లుగా మేకర్స్ భావిస్తున్నారు. స్టార్ హీరోస్ ఇద్దరి విశ్వ‌రూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటంతో, మేకర్స్ సినిమాపై భారీగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Harihara Veeramallu: ఇదేదో ముందే చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా.. నిర్మాత పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్

యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) యూనివర్స్‌లో భాగంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. సుమారు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో య‌శ్ రాజ్ పిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ క‌థ‌ను అందిస్తున్నారు. ఈ ట్రైలర్ సక్సెస్ సాధించిన సందర్భంగా చిత్రానికి కథను అందించిన శ్రీధర్ రాఘవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఆయన మాట్లాడుతూ.. మాతృభూమి ర‌క్ష‌ణ కోసం డేంజ‌ర‌స్ కోవ‌ర్ట్ అనే ఆప‌రేష‌న్‌లోకి ఇద్ద‌రు ఏజెంట్స్ అడుగుపెడ‌తారు. దేశం కోసం అవ‌స‌ర‌మైతే ప్రాణ త్యాగానికి  సైతం వెనుకాడ‌ని వారి ధైర్య‌సాహ‌సాల‌ను, పోరాటాన్ని చాటి చెబుతూ ఈ స్పై యూనివ‌ర్స్ ప్ర‌మాణం ఉంటుంది. ఈ ప్ర‌మాణం సినిమా క‌థ‌తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఆడియెన్స్‌కు థియేట‌ర్ల‌లో అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. దేశం కోసం పోరాడే ఇద్ద‌రు ఏజెంట్లు.. అసలెందుకు ఒక‌రితో మ‌రొక‌రు త‌ల‌ప‌డాల్సివ‌చ్చింది? అనేది ఇందులో క్యూరియాసిటీని క‌లిగించే విషయం. అస‌లీ ఇద్ద‌రిలో నిజ‌మైన ఏజెంట్ ఎవ‌రు? వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న లింక్ ఏంటనేది చూస్తున్న ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా మాత్రం మా ప్రొడ్యూస‌ర్‌దే. అందుకే ట్రైలర్ అద్భుతమైన ఆదరణను రాబట్టుకుంటోంది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Anasuya Bharadwaj: నేను ఇప్పటికి 30 లక్షల మందిని బ్లాక్ చేశా.. అనసూయ కామెంట్స్ వైరల్

తెలుగు, హిందీ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ స్పై యాక్ష‌న్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్స్ అయిన‌ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేలా ఈ ‘వార్ 2’ సినిమా ఉంటుందని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చూద్దాం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి యుద్ధం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

KTR: జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం: కేటీఆర్

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం