Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెర, వెండితెరల్లో ప్రముఖ యాంకర్‌గా, నటిగా గుర్తింపు పొందింది. జబర్దస్త్ షో ద్వారా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేసే వారిని వెంటనే బ్లాక్ చేస్తానని, ఇప్పటివరకు అలా 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటానని వెల్లడించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: Somy Ali: ఆదిత్య పంచోలీ, సూరజ్ పంచోలీపై సంచలన ఆరోపణలు చేసిన నటి సోమీ అలీ
అయితే, వాస్తవానికి అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల ఫాలోవర్స్ మాత్రమే ఉండగా, 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు చెప్పడం చర్చను రేకెత్తించింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ, ఫాలోవర్స్ కంటే ఎక్కువ మందిని ఎలా బ్లాక్ చేశారు. చెప్పిన కూడా కొంచం నమ్మేలా ఉండాలని అంటున్నారు.
అయితే, ఇంటర్వ్యూలో అనసూయను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్పందిస్తూ, 30 లక్షలు అనేది ఖచ్చితమైన సంఖ్య, కాకపోయినా, ఆమె అంత మందిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఆమె నెగెటివ్ కామెంట్స్‌ను ఎదుర్కొంటూ, తన మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలిపారు. అనసూయ గతంలోనూ సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు.
Also Read: Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?
2021లో ఓ నెటిజన్ ఆమెపై అసభ్య కామెంట్స్ చేయడంపై ఆమె ఘాటుగా స్పందించి, తనను ధూషించే వారికి సిగ్గు, భయం లేకపోయినా, తన తల్లిదండ్రులు తనను అలా పెంచలేదని చెప్పారు. అలాగే, 2025 మార్చిలో తన డ్యాన్స్‌ను విమర్శించిన నెటిజన్‌కు రిప్లై ఇస్తూ, మర్యాదపూర్వక విమర్శలను స్వాగతిస్తానని, అయితే అవమానకర ట్రోల్స్ చాలా బాధాకరమని తెలిపింది.