Harish Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Harish Rao: బాధితులకు కోటి రూపాయల పరిహారం అందేనా: హరీష్ రావు

Harish Rao: సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితుల పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) బాధిత కార్మికుల కుటుంబాలతో కలసి నిరసనకు దిగారు. బీఆర్ఎస్(BRS) పార్టీ కి చెందిన ఎమ్మేల్యేలు సునీతా లక్ష్మా రెడ్డి(Sunith laxma Reddy), చింతా ప్రభాకర్, మాణిక్యరావులతో కలసి సంగారెడ్డి(sangareddy) కలెక్టర్ రేట్ వరకు ర్యాలీ నిర్వహించి అడిషనల్ కలెక్టర్ చంద్ర శేఖర్ కు బాధిత కార్మికుల కుటుంబాలతో కలసి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నారని, సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కానీ, నెల రోజులు అయిన ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి పరిహరం అందలేదనీ హరీష్ రావు అన్నారు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి నెలకొన్నదని బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని కన్నీరు పెట్టుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయం
ఉమ్మడి ఏపీలో, మన రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రమాద ఘటన జరగలేదు. 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయం బాధ్యతారాహిత్యమా అని అన్నారు. ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారనీ అని బాధితులు అడిగితే, ఎస్ ఎల్ బీ సీ(SLBC) ఘటనలో శవాలు కూడా రాలేదు, మీకు బూడిదైనా దొరికింది అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని హగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, బిహార్, జార్ఖండ్, యూపీ నుంచి రావాలంటే, ఉండాలంటే 20, 30 వేలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.

ప్రభుత్వం కోటి ఇస్తామని అన్నారని, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు అని అడిగితే ఎవరూ చెప్పడం లేదని అంటున్నారనీ దుయ్యబట్టారు. చాలా మంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారని, తీవ్రంగా గాయపడ్డవారికి ప్రభుత్వం పది లక్షలు ఇస్తామని చెబితే, 50వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని, తీవ్రంగా గాయపడిన వారికి 50లక్షలు ఇచ్చి, నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చివరకు హైకోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్(Scientist for People in the High Court) స్వచ్చంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని రిట్ పిటిషన్ వేసిందని గుర్తుచేశారు.

Also Read: Jupally Krishnarao: హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బెటర్

పాత మిషన్ వల్ల ప్రమాదం
ప్రమాదం జరిగి నెల గడిచినా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులు అధికారికంగా వెల్లడించలేదనీ హరీష్ రావు ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నది. ఇప్పటి వరకు నష్టపరిహారం వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పాలనీ హరీష్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదులో సిగాచి కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనేక సార్లు కార్మికులు చెప్పినా, కంపెనీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అంటే యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం ఉంది. ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలేదనీ హరీష్ రావు ప్రశ్నించారు. ఫిర్యాదులో స్పష్టంగా ఉందని, ఎఫ్ ఐ ఆర్(FIR) కూడా అయ్యి ఉన్న ఎందుకు యాజమాన్యంను ప్రభుత్వం కాపాడుతుందో, ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కు అయిందో, కంపెనీతో ఉన్న లాలూచి ఏమిటి? బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. శవాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారు. వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి, ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం
ఏపీలో 2024, ఆగస్టు 20 నాడు అనకాపల్లిలో ఓ కంపెనీ ప్రమాదం జరిగి 17 మంది మరణిస్తే, కొందరికి గాయాలు అయితే మూడు రోజుల్లో కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడితే 50లక్షలు, తక్కువగా గాయ పడితే 25లక్షలు ఇచ్చారు. అక్కడ మూడు రోజుల్లో ఇస్తే, ఇక్కడ నెల రోజులు గడిచిందని ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా కోటి రూపాయలు, తీవ్రంగా గాయ పడితే 50, తక్కువగా గాయపడితే 25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అసలు ఎవరు ఇస్తరు, ఎక్కడ ఇస్తరు, నువ్వు పట్టించుకోవు, కంపెనీ పట్టించుకోదు. ప్రభుత్వం వలస కార్మికుల డెడ్ బాడీలను అగౌరవపరిచిందని, ఇంత దారుణం ఎందుకు అని ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు.

అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. ఎస్ ఎల్ బీ సీ(SLBC) ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికి రావడం లేదు. వారు చనిపోయారో, బతికి ఉన్నారో తెలియదు. సిగాచిలో జరిగితే 8 మంది శవాలు ఇవ్వలేదు, బొక్కలు ఇవ్వలేదు, బూడిద ఇవ్వలేదు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. సిగాచి ప్రమాదం పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బిఆర్ఎస్ తరుపున పోరాటం తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం ఇలాంటి విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరువాలనీ హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Congress: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు