MLC Kavitha To Stay In Jail Custody Extended By 14 Days
క్రైమ్

MLC Kavitha: ఊరట లేదు.. కవితకు కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కడం లేదు. బెయిల్ పిటిషన్ పై దరఖాస్తులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జ్యుడీషియల్ కస్టడీ గడువు మాత్రం పెరుగుతూనే ఉన్నది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమె కస్టడీని పొడిగించింది. మరో 14 రోజులపాటు ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. అంటే జూన్ 3వ తేదీ వరకు ఆమె తిహార్‌లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సి ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు వేయగా.. న్యాయమూర్తి కావేరి బవేజా డిస్మిస్ చేశారు. కాగా, రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. కవిత్ బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇది వరకే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి దీనిపై స్పందించాలని మే 10వ తేదీన ఈడీకి హైకోర్టు నోటీసులు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ పై తదుపరిగా మే 24వ తేదీన విచారణ జరపనుంది.

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌పై తిహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!