Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ నటించిన హీరోగా నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ జులై 24, 2025న రిలీజ్ అయింది. అయితే, సినిమా ఎంత పాజిటివ్ గా ముందుకెళ్ళాలనుకున్నా కథలో కొన్ని మైనస్ లు ఉండటంతో ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా VFX, స్క్రీన్‌ప్లే లోపాలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే, నిర్మాతలు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించి, మళ్లీ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ మార్పుల్లో గుర్రపు స్వారీ సన్నివేశాలు, బాణం సన్నివేశం, ఫ్లాగ్ సన్నివేశం, తుఫాను సన్నివేశాలను VFX లో రీ ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఈ మార్పుల తర్వాత సినిమా చాలా బావుందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఈ మార్పులు ముందే చేసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా అంటూ ఫైర్ అవుతున్నారు.
అయిన సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి, VFX లోపాలపై నెటిజన్లు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. “బండరాయి సన్నివేశాన్ని చాలా మార్చారు, గుర్రపు స్వారీ సన్నివేశాలను రెండు షాట్లకు పరిమితం చేశారు, ఫ్లాగ్ సన్నివేశం తొలగించారు, యాగం సన్నివేశంలో మూడు బాణాల షాట్ బావుంది. ప్రీ-క్లైమాక్స్ ఇప్పుడు క్లైమాక్స్‌గా మారింది” అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు.
మరో అభిమాని, “వీప్స్ మీద ముందే దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేదని” అని అభిప్రాయపడ్డారు. ఈ సవరణలతో థియేటర్లలో కొత్త వెర్షన్ ఆడుతుండగా.. బుకింగ్స్ పెరుగుతున్నాయి. అలాగే, మౌత్ టాక్ కూడా మారింది. అయితే, ఈ మార్పులు ముందే చేసి ఉంటే సినిమాకు మరింత పాజిటివ్ టాక్ వచ్చి ఉండేదని అభిమానులు ఫీలవుతున్నారు.
BATTLE FOR DHARMA JUST GOT BIGGER ⚔️⚔️
Updated & reloaded content across all screens for the BEST cinematic experience 🔥🔥#HariHaraVeeraMallu – IN CINEMAS NOW 💥💥#BlockbusterHHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna… pic.twitter.com/nrypIds2PR
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 27, 2025