KTR Kavitha
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BRS Politics: అన్న కార్యక్రమం కళకళ… చెల్లి కార్యక్రమం వెలవెల..

BRS Politics: మాజీ సీఎం కేసీఆర్ వారసులు కేటీఆర్, కవిత. అధికారంలో ఉన్నప్పుడు వీరు ఏ జిల్లాకు వెళ్లినా బీఆర్ఎస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టేవారు. వారు కూడా అదే డాబు, దర్పం ప్రదర్శించేవారు. సామాన్యులు కలిసి బాధలు చెప్పుకొనే అవకాశం ఉండేది కాదు. కేసీఆర్ వారసులు కావడంతో వారి పర్యటనలకు అధికారులు అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అధికారం పోవడంతో క్యాడర్ కొంత వెనక్కి తగ్గింది. ఇప్పుడున్న క్యాడర్ కూడా గతంలో ఉన్నట్టు హంగూ ఆర్భాటం ప్రదర్శించడం లేదు. పోగా మిగిలిన వారు కూడా గతంలో మాదిరి రెస్పాండ్ కావడం లేదు. మిగిలిన కొద్దిమంది అన్న వస్తే ఘన స్వాగతం పలికి చెల్లి వస్తే లైట్ తీసుకుంటున్నారు.

ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మధ్య పెరిగిన గ్యాప్ తారస్థాయికి చేరుకున్నది. ఒకప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చినా సీఎం రేంజ్‌లో బీఆర్ఎస్ శ్రేణుల బిల్డప్ ఇచ్చేవారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు అన్న కేటీఆర్ వస్తే ఘన స్వాగతం పలుకుతున్నారు. చెల్లి కవితను మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అప్పుడు కవిత చుట్టూ ప్రదక్షిణలు చేసిన వరంగల్ నేతలు ఒక్కరు కూడా ఆమెను కనీసం కలిసేందుకు కూడా సాహసం చేయకపోవడం ఇప్పుడు వరంగల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన వివాదం తారస్థాయికి చేరిందని తాజా టూర్‌తో రుజువైందని అంటున్నారు.

Read Also- Jupally Krishnarao: హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బెటర్

కేటీఆర్ కార్యక్రమంలో జోష్

కేటీఆర్ ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లిలో నిర్వహించిన కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు. సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య,పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకట రమణా రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఘనంగా స్వాగతం పలికారు.

కవిత కార్యక్రమంలో కనిపించని నేతలు 

మరోవైపు, కవిత కూడా ఆదివారం వరంగల్ జిల్లాకు వచ్చారు. కానీ, ఆమె కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరు కాలేదు. అందరూ కేటీఆర్ వెంటే ఉన్నారు. కేవలం జాగృతికి చెందిన కొందరు మాత్రమే కవిత వెంట ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కవితను కలిసేందుకు ఆరాటపడ్డ నేతలు కూడా ఇప్పుడు దూరంగా ఉండడం చూస్తే ఆమెను ఎవరూ కలవొద్దని పార్టీ హుకుం జారీ చేసిందా అనే అనుమానం వస్తున్నది. ఏది ఏమైనా ఒకే పార్టీ, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వరంగల్ జిల్లాల్లో పర్యటనకు వచ్చినప్పుడు నేతలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Read Also- Kingdom Pre Release: ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. నిర్మాత పోస్ట్ వైరల్

Just In

01

Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారంలోనే రూ.188 కోట్లు రిలీజ్!

Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!