Somy Ali: ఆదిత్య పంచోలీ, సూరజ్ పంచోలీ జియా ఖాన్ మరణానికి కారణమని సోమీ తెలిపింది. బాలీవుడ్ నటి సోమీ అలీ, నటుడు ఆదిత్య పంచోలీ , అతని కుమారుడు సూరజ్ పంచోలీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసింది. ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఆదిత్య పంచోలీని ఆ విధంగా పిలిచి మహిళలను మోసం చేయడం, వారిపై శారీరక దౌర్జన్యం చేయడం వంటి ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఆదిత్య కుమారుడు సూరజ్ పంచోలీ, 2013లో నటి జియా ఖాన్ మరణానికి కారణమని కూడా ఆమె ఆరోపించింది.
ఆదిత్య పంచోలీపై ఆరోపణలు:
సోమీ అలీ తన పోస్ట్‌లో ఆదిత్య పంచోలీ మహిళలను మోసం చేస్తాడని, వారిని హింసిస్తాడని ఆరోపించింది. అతను తన కుమారుడు సూరజ్‌కి కూడా ఇటువంటి తప్పుడు మార్గాలను నేర్పిస్తున్నాడని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది.
Also Read: Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?
జియా ఖాన్ మరణం:
బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013 జూన్‌లో ముంబైలోని తన నివాసంలో మరణించిన సంఘటన గురించి సోమీ అలీ మాట్లాడుతూ, ఆమె మరణానికి సూరజ్ పంచోలీ కారణమని ఆరోపించింది. జియా ఖాన్ మరణం ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించినప్పటికీ, ఆమె తల్లి రబియా ఖాన్ ఇది హత్య అని, సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించారు.
సూరజ్ పంచోలీ కేసు:
జియా ఖాన్ మరణం తర్వాత, సూరజ్ పంచోలీపై ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదైంది. ఆమె రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్‌లో సూరజ్‌తో తన సంబంధంలో శారీరక, మానసిక వేధింపుల గురించి పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది. అయితే, 2023లో సీబీఐ కోర్టు సూరజ్‌ను సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది.