Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. హిట్ కోసం అల్లాడిపోతున్న విజయ్ దేవరకొండ ఈ సారైనా ఆ విజయాన్ని అందుకుంటాడా? లేదా అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. అయితే, తాజాగా ఈ రౌడీ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ జులై 26, 2025న విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్య దేవ్, భాగ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మూవీ పైన ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు.
Also Read: Harish Rao: బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవర కొండ మళ్లీ రెచ్చిపోయి మాట్లాడాడు. ఒకసారి ఇలాగే మాట్లాడి సినిమా ఫ్లాప్ ను చూశాడు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడటం అవసరమా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే
ఇంకెందుకు లేట్ లెక్కేత్తండయ్యో.. ఇది కూడా తుస్సూ, ఇదే తగ్గించు కుంటే మంచిది, ఈ ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకో… బాగుంటుంది, మళ్ళీ అదే ఓవర్ యాక్షన్ అవసరమా నీకు అని కొందరు దారుణంగా కామెంట్స్ చేయగా, ఇంకొందరు బాగా ఎక్కువ అవుతుంది.. నీకు భాష రాకపోతే మాట్లాడకు, ఎందుకు మా భాషను అలా వచ్చి రానట్టు మాట్లాడతావ్.. అర్జున్ రెడ్డి తప్ప ఇంకో మంచి సినిమా లేదు. నీ కెరీర్‌లో నువ్వు ఎప్పటికీ ఎదగవు, ఓవర్ యాక్టింగ్ స్టార్ అని పెట్టుకో.. నీకు ఆ పేరు బాగా సెట్ అవుతుంది. మా అన్నకి నోటి దుల ఎక్కువ ఈ ఒక్క మూవీ కనుక తేడా కొడితే మారుతాడు లెండి. లేకపోతే రెచ్చిపోతాడు మళ్ళా చెపుతున్నా.. హిట్ పడితే మా అన్నని ఎవ్వడు ఆపలేడు అంటూ ట్రోలర్స్ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు.