Kishan Reddy: దాదాపు 30 ఏండ్ల క్రితం తెలుగు నేలపై తూర్పున ఉదయించిన ఉద్యమానికి మందకృష్ణ నేతృత్వం వహించారని, ఆయన నేతృత్వంలో అలుపెరుగని పోరాటం నిర్వహించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy కొనియాడారు. ఒక ఊరిలో ప్రారంభమైన ఉద్యమం తెలుగు నేలంతా పాకి ఇతర రాష్ట్రాలకు విస్తరించిందన్నారు. ఆపై ఉద్యమ ఫలాలను సైతం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
Also Read: Akshara Deveella: కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ రికార్డు సాధించిన చిన్నారి అక్షర
ఈసందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ (Mandha Krishna) మాదిగను మాధవరం కాంతారావు మిత్ర మండలి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ 15 ఏండ్ల పాటు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో సైతం ఎస్సీ వర్గీకరణ గురించి అనేకసార్లు అడిగానని కేంద్ర మంత్రి వివరించారు. దివ్యాంగుల సమస్యలపై ఉద్యమం, గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యల పరిష్కారానికి చేసిన ఉద్యమంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు.
ఆత్మీయుడిగా వెన్నంటి అండ
ఇదిలా ఉండగా మందకృష్ణ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్, దండోరా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేసిన ఫలితంగా, అనేక మంది ప్రాణత్యాగం చేసిన ఫలితంగా వర్గీకరణ సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో తాను కూడా ఒక కార్యకర్తననని ప్రధాని చెప్పడం తనకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మందకృష్ణ పరిచయమైనప్పటి నుంచి ఆత్మీయుడిగా వెన్నంటి అండగా నిలబడ్డారని, అనేకసార్లు ఈ విషయంలో బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు.
వీ రామారావు నాయకత్వంలో బీజేపీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడిన కార్యకర్తగా, ఒక సైనికుడిగా ఉద్యమంలో పాల్గొన్నట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మందకృష్ణ మరిన్ని సామాజిక సమస్యలపై మరిన్ని ఉద్యమాలను కొనసాగించాలని కోరారు. స్వాతంత్య్రం తర్వాత మొట్టమొదటిసారిగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి కొనియాడారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..