Thummala Nageswara Rao: రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao:) కోరారు. కేంద్రమంత్రి జేపీనడ్డా (JP Nadda)కు ఎరువుల సరఫరాపై లేఖ రాశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 6.60లక్షల మెట్రిక్ టన్నులకు గాను 4.23లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని, ఇంకా 2.37లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఆగస్టు నెల కేటాయింపులతో కలిపి 2.37లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో రైతులంతా సాగును ముమ్మరం చేస్తున్నారని ఈ సమయంలో ఎరువులు అత్యవసరం అని, కేంద్రం స్పందించి ఎరువులు సరఫరా చేయాలని కోరారు.
Also Read: Sangareddy Tragic: సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన.. పసికందు మృతి
ఎరువులపై అధికారులతో సమీక్ష
ఎరువుల సరఫరాపై సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ ప్రతి వానాకాలం (ఖరీఫ్) సీజన్ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశమై, వారి అవసరాలను పరిశీలించి ఎరువుల సరఫరాకు సంబంధించిన వార్షిక కేటాయింపులు చేసే ప్రక్రియలో భాగంగా 2025 ఖరీఫ్ సీజన్‌కు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందన్నారు.
నెలవారీ ప్రణాళికల రూపంలో రాష్ట్రానికి పంపిణీ చేయాల్సి ఉండగా, ఏప్రిల్ 2025 నుంచి జూన్ 2025 వరకు మొత్తం 5.00 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రం ప్రణాళిక చేసిందన్నారు. ఈ మూడునెలల్లో రాష్ట్రానికి కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగిందన్నారు. దీంతో మొత్తం 1.93 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందన్నారు. నెలవారీగా పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.21 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా కాగా, 49 వేలమెట్రిక్ టన్నుల (29%) లోటు ఏర్పడిందని, మే నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 88 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే అందిందన్నారు. ఇది 72వేల మెట్రిక్ టన్నుల (45%) లోటు అని, జూన్ నెలలో కూడా ఇదే విధంగా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికకు 98వేల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా కావడంతో 72వేల మెట్రిక్ టన్నుల (42%) లోటు నమోదైందని వివరించారు.
కఠిన చర్యలు..
కేంద్ర ఎరువుల శాఖ జూలై నెలకు రాష్ట్రానికి కేటాయించిన 1.60 లక్షల మెట్రిక్ టన్నులలో, 63వేల మెట్రిక్ టన్నుల ఇండిజినస్‌గా, 97వేల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్‌గా ఉండగా, 1.16 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. దీంతో జూలైలో 44వేల మెట్రిక్ టన్నులలోటు ఏర్పడిందన్నారు. ఇప్పటికే 4.73 లక్షల మెట్రిక్ టన్నులయూరియాను రైతులు కొనుగోలు చేశారని, వచ్చే ఆగస్టులో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆగస్టు మాసంలో నెలవారి కేటాయింపులతో పాటు, ఇప్పటి దాకా ఏర్పడిన 1.93 లక్షల మెట్రిక్ టన్నుల లోటుతో పాటు జూలై మాసంలో ఇంకా సరఫరా కావాల్సిన 44 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను, ఆగస్టు నెలవారి కేటాయింపులతో కలిపి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా యూరియా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకుండా పటిష్ట చర్యలను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. ఎరువుల కంపెనీల డీలర్లను ఏ ప్రొడక్టు లింకులు పెట్టకుండా విక్రయించేటందుకు వీలుగా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. అదే సమయంలో ఏ డీలర్ కూడా లింక్ పెట్టి అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: Athadu Re Release: ఆయన ఎప్పటికీ హీరోనే.. మురళీ మోహన్