CM Revanth Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: ఐడియాలజీ పాలిటిక్స్ నుంచి స్విగ్గీ రాజకీయాలు: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేకుంటే ప్రత్యేక రాష్ట్రం రాకపోయేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. చర్చ లేకుండానే పార్లమెంట్‌లో తెలంగాణ(Telangana) బిల్ ఆమోదించేలా జైపాల్ రెడ్డి(Jaipal Reddy) ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. జైపాల్ రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పీవీ, జైపాల్ రెడ్డిలు తెలంగాణకు స్పూర్తి దాయకమని కొనియాడారు. గతంలోని ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి, ప్రస్తుతం స్విగ్గీ(Swigy) పాలిటిక్స్ వచ్చాయని సీఎం వివరించారు. సైద్ధాంతిక రాజకీయాలు నుంచి మేనేజ్మెంట్ రాజకీయాల వైపు ట్రెండ్ నడుస్తుందన్నారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్ కు ప్రమాదకరమని నొక్కి చెప్పారు. యూనివర్సిటీల్లోనే విద్యార్ధి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి
హైదరాబాద్(Hyderabad) లో జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులకూ ప్రాధాన్యత ఉండాలన్నారు. అందుకే తాను సీఎం(CM) గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాసన సభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదన్నారు. ప్రతిపక్షాల సహేతుకమైన సహాలు తప్పనిసరిగా అవసరం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లీడర్ల ఎజెండా ఉండాలన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి(Jaipal Reddy) ఒక నిలువెత్తు శిఖరం అని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా, శాసన సభ్యుడిగా,పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి పని చేశారన్నారు. 1969 లో తొలిసారి కల్వకుర్తి(Kalvakurthy) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా,5సార్లు లోక్ సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా,కేంద్ర మంత్రిగా పనిచేశారని వివరించారు. పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.

Also Read: Ramchander Rao: పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు: రాంచందర్ రావు

దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర
సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్‌లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితోనూ జైపాల్ రెడ్డికి వ్యక్తిగత వైరం లేదన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి(Jaipal Reddy) అని కొనియాడారు. చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారన్నారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై జైపాల్ రెడ్డి ఎక్కువ ఆలోచించేవారని సీఎం వెల్లడించారు. ఆయన ఎమ్మెల్యే(MLA)గా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఇక రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ఆయన ప్రయత్నించినట్లు సీఎం చెప్పారు. కాంగ్రెస్(Congress) ను వీడినా, తిరిగి కాంగ్రెస్లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్పా పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదన్నారు.

Also Read: Farmers Protest: రోడ్లపై నాట్లు వేస్తూ నిరసన.. అడుగడుగునా సమస్యలే!

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?