Mallikarjuna Kharge: తెలంగాణలో కులగ‌ణ‌న దేశానికి దిశానిర్దేశం!
Mallikarjuna Kharge (image CREDIT: SWTCHA REPORTER OR TWITTER)
Telangana News

Mallikarjuna Kharge: తెలంగాణలో కులగ‌ణ‌న దేశానికి దిశానిర్దేశం!

Mallikarjuna Kharge: రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాన‌మంత్రి మోదీ దేశ వ్యాప్తంగా జన గణన నిర్వహిస్తామని ప్రకటించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రకటించారు. తెలంగాణలో పూర్తి చేసిన తర్వాత జన గణనలో కుల గణనను చేస్తామని కేంద్రానికి దిగిరాక తప్పలేదన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గ‌ణ‌న దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. కుల గణన చేప‌ట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్న సాహసోపేతమైన చర్యగా ఆయ‌న అభివర్ణించారు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ప్రశంసించారు.

 Also Read: CM Revanth Reddy: కులగణన రోల్ మోడలే కాదు..రేర్ మోడల్ దీని అర్థం త్వరలోనే చెబుతా!

కుల గణన అంశాన్ని లేవనెత్తడమే కాకుండా, ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడటానికి రాహూల్ కారణమని అన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై సమిష్టిగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక ఏఐసీసీ కార్యాల‌యంలో స‌ర్వేపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చి ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు కార్యక్రమ సంధాన‌క‌ర్తగా వ్యవ‌హ‌రించారు.

 స్వ‌తంత్ర నిపుణుల క‌మిటీ

ఈ స‌మావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్ర నేత‌లు దిగ్విజ‌య్ సింగ్, జైరాం ర‌మేశ్‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్‌, కొండా సురేఖ‌, వాకిటి శ్రీ‌హ‌రి, కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, స్వ‌తంత్ర నిపుణుల క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు. అంతకంటే ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి (సంస్థాగ‌త‌) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్‌, కొండా సురేఖ త‌దిత‌రులు ఖ‌ర్గే నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ స‌ర్వే ప్రక్రియ‌, శాస‌న‌స‌భ‌లో బిల్లుల ఆమోదం, పార్ల‌మెంట్‌లో వాటి ఆమోదంపై చ‌ర్చించారు.తదుపరి నిర్ణయాలపై సలహాలు, సూచనలు సేకరించారు.

 Also Read:Tragedy: మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య 

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్