BC Reservation Bill (imagecredit:twitter)
Politics

BC Reservation Bill: బీజేపీ పోరు బాట.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్

BC Reservation Bill: రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చేనెల 2వ తేదీన మహాధర్నాను చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. 42 శాతం బీసీ(BC) రిజర్వేషన్ల అంశంపై ఈ ధర్నాను చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ హామీని ఇచ్చింది. అయితే బీజేపీ(BJP) 42 శాతం రిజర్వేషన్లకు సానుకూలంగానే ఉన్నా అందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం వల్ల బీసీ(BC)లు నష్టపోతారని కమలదళం ముందు నుంచే ఆందోళన వ్యక్తంచేస్తోంది. కాగా ఈ మహాధర్నాతో ప్రజలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించింది.

రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు(Ramchandar Rao) ఎన్నికైన తర్వాత ఈ మహాధర్నా ఫస్ట్ టాస్క్ కానుంది. పార్టీ వ్యవహారాల్లో ఆయన టాస్క్ ఇప్పటికే మొదలైనా ప్రజా పోరాటాల్లో మాత్రం ఇదే ఫస్ట్ టాస్క్ కానుంది. అందుకే పూర్తిస్థాయిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలుచేసి స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్(Congrss) ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపాక పార్లమెంట్ కు సైతం పంపించింది. అయితే రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడ్డుకుంటోందని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇది కాషాయ పార్టీకి మైనస్ గా మారింది. అంతటితో రాష్ట్ర ప్రభుత్వం ఆగకుండా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయింది. మహాధర్నాకు ప్లాన్ చేస్తోంది.

న్యాయ సలహాలు తీసుకున్నారా
ఇప్పటికే రాంచందర్ రావు(Ramchender Rao) బీసీ రిజర్వేషన్ల అంశంపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాకుండా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 50 శాతం క్యాప్ మించుతుందని స్పష్టంచేశారు. కానీ ఆర్డినెన్స్ రాకముందే అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడంపై బీజేపీ(BJP) ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అంతేకాకుండా బీజేపీ మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు ముందు నుంచే పూర్తిగా వ్యతిరేకమని చెబుతోంది. ఈ అంశంలో కాంగ్రెస్(Congress) నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం తగదని విమర్శలు చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు(Congress) చెబుతున్నారు.

Also Read: Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్‌ ప్రభుత్వమే

అయితే కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానంగా ఉందని కాషాయ పార్టీ ప్రశ్నిస్తోంది. బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సి ఉంటుందని బీజేపీ(BJP) చెబుతోంది. దీనికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఆధారంగా చూపిస్తోంది. ఎందుకంటే 1973లో కేశవనంద భారతీ కేసు(Kesavananda Bharathi case)లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కమలదళం చెబుతోంది. 9వ షెడ్యూల్‌లో చేర్చినా, ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని వాదిస్తోంది. అంతేకాకుండా జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినా, అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉందని. ఇంకా తుది నిర్ణయం రాలేదని కాషాయ పార్టీ చెబుతోంది.

హైకోర్టు ఇచ్చిన గడువు
కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కేంద్రం మోకాలడ్డుపెడుతోందని చెప్పడంపై కాషాయ దళం(BJP) ఆగ్రహంగా ఉంది. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తిచేయాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో(ఈనెల 25) ముగియనుంది. ఈ గడువు ముగియనుండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌ను చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్(Congress) ఓటుబ్యాంకు రాజకీయాలను చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అందుకే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ధర్నాకు పార్టీతో పాటు ఇతర బీసీ(BC) సంఘాలను సైతం కలుపుకుని వెళ్లేలా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకుంది.

Also Read: Check Dams: భూగర్భజలాల పెంపే లక్ష్యంగా సర్కార్ అడుగులు

 

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?