Skid Game In Bangalore
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: జర్నలిస్టుల ‘స్క్విడ్ గేమ్’.. వైరల్ వీడియో ఇదిగో!

Viral News: నిరసన ఎంత భిన్నంగా, సృజనాత్మకంగా చేస్తే, అది అంత ప్రభావవంతంగా ఉంటుంది. జనాల దృష్టిని వెంటనే ఆకర్షించి, ఆలోచన కలిగించాలంటే నిరసనలో వైవిద్యం చాలా ముఖ్యం. అదే చేసి చూపించాడు కర్ణాటక చిత్రకారుడు బదల్ నంజుందస్వామి. బెంగళూరులో రోజురోజుకూ దిగజారుతున్న రోడ్ల పరిస్థితులు, పాదచారులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనన వినూత్నంగా నిరసన తెలిపారు. 2021లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ పేరు (Viral News) ఉపయోగించుకున్నారు.

బెంగళూరులో పాదాచారులు నడిస్తే జారిపడిపోయే దుస్థితిపై వ్యంగ్యంగా ‘మన బెంగళూరులో ‘స్క్విడ్ గేమ్’ అంటే నిరసన తెలిపాడు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నంజుందస్వామి తాను చేపట్టిన వినూత్న నిరసనలో పలువురు జర్నలిస్టులను కూడా భాగస్వామ్యం చేసుకున్నాడు. బెంగళూరులోని సెంట్ జాన్స్ హాస్పిటల్‌ సమీపంలో పాదచారులు నడిచే ఫుట్‌పాత్‌పై ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన అనుభవాలను ‘స్వ్కిడ్ గేమ్’ పేరిట చూపించారు.

Read Also- Walking Tips: రోజుకు 7 వేల అడుగులు నడిస్తే ఆరోగ్య అద్భుతాలు!

నిరసనలో పాల్గొన్న జర్నలిస్టులు స్క్విడ్ గేమ్‌ వెబ్‌సిరీస్‌లో పాత్రధారుల మాదిరిగా వేషధారణ వేసుకున్నారు. పగిలిపోయి ఉన్న ఫుట్‌పాత్‌లు, ఓపెన్ డ్రెయినేజీలు, బయటకొచ్చిన కేబుల్స్, రాళ్లు, గుంతలు వంటి అడ్డంకులను దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిరసనకారులు ‘స్క్విడ్ గేమ్’ పాత్రధారుల దుస్తుల్లో ఉండడంతో కాస్త నవ్వు తెప్పించినప్పటికీ, సమస్య తీవ్రత చాలా స్పష్టంగా అర్థమైంది. బెంగళూరు నగరంలో వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టింది. జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ నవడం, ఒకాయన ఓ రాయిపై కాలు మోపగా అది స్కిడ్ కావడం వీడియోలో కనిపించాయి. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే 1.50 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో బెంగళూరులో పౌరుల మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో, అక్కడి ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

Read Also- Hari Hara Veera Mallu: విద్వేషం తప్ప హరిహర వీరమల్లు సినిమాలో ఏముంది?

ఈ వీడియోపై నెటిజన్లు పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘‘ఈ వీడియో చూస్తే నవ్వు రావడం ఖాయం!. అయితే, నవ్వుల వెనుక దాగి ఉన్న సందేశం మాత్రం చాలా తీవ్రమైనది. బెంగళూరులో నడక ఓ ఆట మాదిరిగా ఉండకూడదు. నగరంలోని రోడ్లపై నడవాలంటే ఒక రేసింగ్ ఆట మాదిరిగా మారిపోయింది. వీడియో చూడగానే స్పష్టమైన భావన కలుగుతోంది’’ అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ఫొటో ఎడిటర్ అయిన అనంత సుబ్రహ్మణ్యం ఓ నెటిజన్ స్పందిస్తూ, చిత్రకారుడు నంజుందస్వామి, నగరంలోని కొంతమంది జర్నలిస్టులతో కలిసి స్క్విడ్ గేమ్ సీక్వెన్స్‌లా నటించి బెంగళూరులో పాదచారులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను చక్కగా హైలైట్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు’’ అని మెచ్చుకున్నారు.

ఒక నెటిజన్ మరింత హాస్యాస్పదంగా స్పందించాడు. ‘‘బృహత్ బెంగళూరు మహానగర పాలికెకు (BBMP) అభినందనలు. అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన సెయింట్ జాన్ హాస్పిటల్‌కు సమీపంలో ఈ అసౌకర్యాలు ఉంచడం చక్కటి ముందుచూపు. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్‌ దూరం కాదు కదా!” అని వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, “రోడ్ రాష్, సూపర్ మారియో లాంటి ఆటల్లో నేటి తరానికి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించారనుకుంటా!” అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మొత్తంగా తక్కువ ఖర్చుతో పెద్ద సందేశాన్ని ఇచ్చారంటూ నంజందస్వామి, ఇతర జర్నలిస్టులపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..